iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్

  • Published Mar 06, 2024 | 3:24 PM Updated Updated Mar 06, 2024 | 3:24 PM

janhvi kapoor visits tirupati temple: తన పుట్టిన రోజు సందర్బంతా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

janhvi kapoor visits tirupati temple: తన పుట్టిన రోజు సందర్బంతా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

  • Published Mar 06, 2024 | 3:24 PMUpdated Mar 06, 2024 | 3:24 PM
తిరుమల శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్.. వీడియో వైరల్

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నట వారసులు హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అయిన అతిలోక సుందరి శ్రీదేవి తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి ప్రముఖ నిర్మాత బోనిక్ కపూర్ ని వివాహం చేసుకొని అక్కడే స్థిరపడిపోయింది. బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. తన పెద్ద కూతురు జాన్వీ కపూర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే కోరిక ఉండేది.. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె అనుకోకుండా కన్నుమూశారు. తర్వాత జాన్వీ హీరోయిన్ గా మారింది. తాజాగా జాన్వీ కపూర్ తిరుమలలో సందడి చేసింది. వివరాల్లోకి వెళితే..

భారతీయ చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 2018 లో ధడక్ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించింది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీదేవి బాటలో నడుస్తున్న జాన్వీ కపూర్ తల్లి పేరు నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ కుర్రాళ్లకు పిచ్చేక్కించే ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. ఎందుకంటే.. ఎన్టీఆర్ తోనే కాదు.. త్వరలో రామ్ చరణ్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ ఇద్దరు హీరోలు ఇటీవల ఆర్ఆర్ఆర్ తో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

నటి శ్రీదేవికి  తన పిల్లల పుట్టిన రోజు సందర్భంగా తప్పకుండా తిరుపతికి వచ్చి శ్రీవారి సేవలో పాల్గొనేది.  తన తల్లి లేకున్నా.. జాన్వీ కపూర్ తిరుపతికి వస్తూ స్వామి వారి దర్శనం చేసుకుంటుంది. నేడు జాన్వీ కపూర్ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా  శ్రీదేవి చెల్లెలు, ప్రముఖ నటి మహేశ్వరి, మరికొంతమంది స్నేహితులతో కలిసి తిరుమల తిరుపతికి వచ్చింది. స్వామి వారికి మొక్కులు చెల్లించి తీర్థ ప్రసాదాలు అందుకుంది. లంగా ఓణీలో జాన్వీ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. గుడి వెలుపలికి రాగానే ఆమెతో అభిమానులు సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş