iDreamPost
android-app
ios-app

Yellamma Movie: యల్లమ్మ జస్ట్ సింపుల్ పోస్టర్

  • Published Aug 03, 2026 | 10:48 AM Updated Updated Aug 03, 2026 | 10:48 AM

దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'యల్లమ్మ' నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. వీడియో కోసం ఎదురుచూసిన అభిమానులకు పోస్టర్ మాత్రమే వచ్చినా, హీరో లుక్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

దేవీశ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా 'యల్లమ్మ' నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. వీడియో కోసం ఎదురుచూసిన అభిమానులకు పోస్టర్ మాత్రమే వచ్చినా, హీరో లుక్ మాత్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Yellamma Movie: యల్లమ్మ జస్ట్ సింపుల్ పోస్టర్

నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు వెల్దండి కాంబినేషన్ క్రేజీ ప్రాజెక్ట్ యల్లమ్మ. ఈ సినిమాలో హీరోగా దేవీశ్రీప్రసాద్ ను అనౌన్స్ చేసినపుడు మాంచి విడియో కట్ విడుదల చేసారు. సినిమా జానర్, హీరో క్యారక్టర్ ఇవన్నీ అందులో కనిపించాయి. ఆకట్టుకుంది కూడా. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతోంది. దేవీశ్రీప్రసాద్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదో ఒక కంటెంట్ వస్తుందని అందరూ అనుకున్నారు. అలాగే వచ్చింది కూడా. కానీ విడియో కంటెంట్ కాదు. జస్ట్ పోస్టర్. నిజానికి సినిమా షూట్ సైలంట్ గా చకచకా జరిగిపోతోంది. అందువల్ల ఏదైనా మరో విడియో కంటెంట్ ఇవ్వాలి అనుకుంటే యూనిట్ కు సాధ్యమే.

కానీ విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. చాలా అంటే చాలా సినిమాలు షెడ్యూలు చేసి వున్నాయి కనుక, రెడీ చేసి పెట్టుకుంటే సరైన డేట్ కు వదలవచ్చు అన్నది నిర్మాతల ఆలోచన. అందువల్ల ఈ లోగా ఎందుకు కంటెంట్ వదిలేయడం. బహుశా ఈ ఆలోచనతోనే జస్ట్ పోస్టర్ ఇచ్చి వదిలేసారు.

పీరియాడిక్ యంగస్టర్ లుక్ లో దేవీ కనిపించారు. చేతిలో అమ్మవారి కిరీటం లాంటిది వుంది. ఇన్నోసెంట్, పీరియాడిక్ లు, చేతిలో కిరీటం చూస్తే ఆ రోజుల్లో కాస్త చదువుకున్న కుర్రాడు, విలేజ్ లోని ఆచారాలు వీటి నడుమ జరిగే కథ అని హింట్ దొరకుతోంది. మొత్తానికి ఎల్లమ్మ విషయంలో మేకర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet