Chiranjeevi
హర్రర్ కామెడీ జానర్, వరుణ్ తేజ్ రీఎంట్రీ, మేర్లపాక గాంధీ దర్శకత్వం, యువీ క్రియేషన్స్ బ్యానర్.. ఈ పాజిటివ్ అంశాలన్నీ కలిసి 'కొరియన్ కనకరాజు'కు భారీ ఓపెనింగ్ తీసుకొస్తాయా?
హర్రర్ కామెడీ జానర్, వరుణ్ తేజ్ రీఎంట్రీ, మేర్లపాక గాంధీ దర్శకత్వం, యువీ క్రియేషన్స్ బ్యానర్.. ఈ పాజిటివ్ అంశాలన్నీ కలిసి 'కొరియన్ కనకరాజు'కు భారీ ఓపెనింగ్ తీసుకొస్తాయా?
Chiranjeevi
ఈ మధ్యకాలంలో పబ్లిసిటీకి ప్రాధాన్యం పెరిగింది అని చెప్పడం కన్నా, వైవిధ్యమైన ప్రచారానికి తెరలేచింది అని చెప్పడం సముచితంగా వుంటుంది. అనిల్ రావిపూడి స్టార్ట్ చేసిన ట్రెండ్ ను ఇప్పుడు అందరూ అందుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ సినిమాకు వైవిధ్యంగా ప్రచారం సాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రచారం ఆకట్టుకుంటోంది కూడా. అయితే ప్రచారం ఆకట్టుకున్నా కొన్ని సినిమాలకు ఓపెనింగ్ తెగడం లేదు. కొన్ని సినిమాలకు ఓపెనింగ్ పడుతోంది.
ఓపెనింగ్ పడాలి అంటే సినిమాకు సహజమైన క్రేజీ పాయింట్ వుండాలి. హీరో-డైరక్టర్ లేదా బ్యానర్-జానర్ ఇలా ఇవన్నీ కలిసి రావాలి. ఆపైన డిఫరెంట్ పబ్లిసిటీ జరగాలి. కొరియన్ కనకరాజు వరకు చూసుకుంటే ఇవన్నీ కలిసి వచ్చినట్లే కనిపిస్తోంది.
దర్శకుడు మేర్లపాక గాంధీ కి కలిసి వచ్చిన జానర్ లో వస్తున్న సినిమా ఇది. అలాగే జనాలకు నచ్చే హర్రర్ కామెడీ సినిమా. ఈ రెండూ పెద్ద అడ్వాంటేజ్. ఆ తరువాత ప్లస్ పాయింట్ హీరో వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తరవాత అందిస్తున్న సినిమా. అది కూడా ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో. వీటన్నింటికి తోడు యువి సంస్థ సినిమా అంటే మినిమమ్ క్వాలిటీ వుంటుందనే భరోసా.
ఇప్పుడు ఈ అన్ని పాజిటివ్ పాయింట్లకు, రిలీజ్ కు ముందు వారం రోజుల పాటు సాగించిన ప్రచారం బాగా నడిచింది. ఇప్పుడు ఇవన్నీ కలిసి సినిమాకు ఏ మేరకు ఓపెనింగ్ తెస్తాయి అన్నది చూడాలి. సరైన ఓపెనింగ్ పడింది అంటే అన్ని పాయింట్లు కలిసి జనాల్లోకి సినిమాను తీసుకెళ్లాయి అని ఫిక్స్ అయిపోవచ్చు. కానీ ఓపెనింగ్ తెగకపోతే మాత్రం లోపం ఎక్కుడ వుంది అని అనుమానించాల్సి వుంటుంది. మెగా హీరో కి క్రేజ్ తగ్గిందా లేదా దర్శకుడు మేర్లపాక మీద ఆసక్తి తగ్గిందా అని.