తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతుల్లో ఉండటాన్ని కొందరు నందమూరి అభిమానులు వ్యతిరేకిస్తుంటారు. అది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ కాబట్టి.. నందమూరి కుటుంబానికి చెందిన వారసులే ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ ఉన్నాయి. టీడీపీ నందమూరి కుటుంబానికి మాత్రమే సొంతమనే అభిప్రాయం ఇప్పటికీ కొందరిలో బలంగా ఉంది. తాజాగా నందమూరి వారసుడు తారకరత్న సైతం అదే అర్థమొచ్చేలా కామెంట్స్ చేశాడు. ఓ వైపు చంద్రబాబుని పొగుడుతూనే.. మరోవైపు ఈ పార్టీ మాది అంటూ ఆయన […]
టీడీపీ నేత, మాజీ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గుట్టు రట్టైంది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమణ చేసి అక్కడ ఇల్లు కట్టారు. ఈ అక్రమ నిర్మాణంపై ముందుగానే నోటీసులు ఇచ్చారు అధికారులు. తాజాగా అక్రమంగా నిర్మించిన ప్రహరీని కూల్చేశారు. దీంతో ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. చెరువు కాలువకు సంబంధించిన 2 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారని చెప్తున్నారు అధికారులు. అయ్యన్న కుటుంబం చేసిన అక్రమ నిర్మాణాన్ని గుర్తించి నోటిసులు జారీ చేశామని, నిబంధనలు ప్రకారం […]
టీడీపీకి మరో ఊహించని షాక్ తగిలింది. మహానాడు తరువాత పార్టీలో కొత్త ఉత్తేజం వచ్చిందని శ్రేణులు అనుకుంటున్న తరుణంలో తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి రాజీనామా అంశం హాట్ టాపిక్ గా మారింది. దివ్యవాణి ముందుగా తన రాజీనామా విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కానీ, ఏ కారణం చేతనో ఆ పోస్ట్ ను డిలీట్ చేశారు. తాజాగా రెండోసారి ఆమె తన రాజీనామా అంశంపై స్పష్టతనిచ్చారు. ఇటీవలి కాలంలో టీడీపీలో బాగా ఉత్సాహంగా […]
తనకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయడం సరైంది కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అనడాన్ని అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఇప్పటి వరకు తనపై తొమ్మిది కేసులు నమోదు చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అవినీతిని వ్యతిరేకిస్తున్నందుకే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. నర్సీపట్నంలో అక్రమ మైనింగ్ ఆపాలని, ప్రకృతి సంపదను దోచుకొనే అధికారం వైఎస్సార్ సీపీ నేతలకు లేదని వ్యాఖ్యానించారు. నోటికొచ్చినట్టు […]
కుర్చీని కాపాడుకునే యావలో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడితే.. అదే ఆత్మగౌరవ నినాదంతో ఢిల్లీ పిక్కటిల్లేలా గర్జించి తెలుగు జాతి గురించి తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్టీ రామారావు ఎలుగెత్తి చాటితే.. ఆయన్నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు ఆత్మవంచక విధానాలతో పార్టీకి ఆత్మ లేకుండా చేశారు. జీవచ్చవంలా మార్చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా, పేదల ప్రతినిధిగా ఉండాలన్న పార్టీ మూల సిద్ధాంతాలను మూలన పెట్టేశారు. సామాన్యులకు రాజకీయాధికారం అందించాలన్న ఎన్టీఆర్ ఆశయాలకు […]
ఒక చారిత్రక అవసరం నుంచి ఆవిర్భవించిన తెలుగుదేశం తన నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నడూ లేనంత పతనావస్థకు దిగజారిపోయింది. రాష్ట్రంలో నాడు నెలకొన్న రాజకీయ అస్థిరత, ఆరునెలలకో ముఖ్యమంత్రి మారిపోవడం, రాష్ట్రాలపై ఢిల్లీ పెత్తనం, ప్రజా సమస్యలను పట్టించుకునేవారు లేకపోవడం వంటి పరిస్థితులు నందమూరి తారకరామారావును తెలుగుదేశం పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు పురిగొల్పాయి. ఆంధ్రుల అభిమాన నటుడిగా ఆయనకున్న చరిష్మా, రాజకీయ శూన్యత ఆ పార్టీని అందలమెక్కిస్తే.. సిద్ధాంతాలకు నీళ్లొదలడం, అవకాశవాద రాజకీయాలు నేడు అదే […]
రావడం లేటవుతుందేమో గానీ రావడమైతే మాత్రం పక్కా.. ఓ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై తాజాగా ఉపయోగిస్తున్నారు. జూనియర్ రాకతోనే టీడీపీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని టీడీపీ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత జూనియర్ రాజకీయాల్లోకి రాకపై మొదలైన ప్రచారం.. ఇటీవల పంచాయతీ ఎన్నికల తర్వాత మరింత ఊపందుకుంది. ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగా జూనియర్కు మద్ధతు ప్రకటిస్తున్నారు. కుప్పంలో […]
రాజకీయ పార్టీలకు అతీతంగా సాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేశారంటూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. నిబంధనలు అతిక్రమించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషనర్ తాజాగా టీడీపీ కార్యదర్శి వెంకటరాజుకు నోటీసులు జారీ […]
మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య మొదలైన మాటల యుద్ధంతో.. ప్రస్తుతం కృష్ణా జిల్లా రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి. కొడాలి నాని లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు మాత్రం ప్రస్తుతం ఎక్కడా కనిపించకపోవడం, వినిపించకపోవడంపై చర్చ సాగుతోంది. కొడాలి నానిపై బొండా ఉమా మహేశ్వరరావు ఒంటికాలిపై లేచేవారు. దేవినేని ఉమా, […]
ఆంధ్రప్రదేశ్లో బలపడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో జనసేనతో కలసి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత ఆ పార్టీ పని తీరు పూర్తిగా మారిపోయింది. ఏపీలో ఆది నుంచి టీడీపీకి బి పార్టీలానే బీజేపీ ఉంది. ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. టీడీపీ స్థానంలోకి రావాలని బీజేపీ నేతలు లక్ష్యాలు […]