iDreamPost
android-app
ios-app

దళిత యువకుడిపై దాడి.. టీడీపీకి మంత్రి సురేష్ సవాల్!

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రాంతంలో దళిత యువకుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ, టీడీపీల మధ్య సీరియస్ వార్ నడుస్తోంది. యువకుడి దాడి ఘటనపై తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  స్పందించారు. అంతేకాక టీడీపీ నేతలకు మంత్రి సురేష్ సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కారణంగా ఇక్కడ ఎన్నికలు లేకున్నా కూడా ఆ రేంజ్ లో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. ప్రతి అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇప్పటికే అనేక అంశాలపై  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సవాల్ జరుగుతుంటాయి. తాజాగా విజయవాడ ప్రాంతంలో దళిత యువకుడిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వైసీపీ, టీడీపీల మధ్య సీరియస్ వార్ నడుస్తోంది. యువకుడి దాడి ఘటనపై తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  స్పందించారు.

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై దాడి జరిగిన ఘటన అందరికి తెలిసిందే.  ఈ ఘటనకు అధికార పార్టీయే కారణమంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.  అయితే టీడీపీ నేతలకు పురపాల శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. యువకునిపై దాడి చేసిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారని మంత్రి అన్నారు. దాడి చేసిన వ్యక్తులపై  ఇప్పటికే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఘటనను టీడీపీ రాజకీయాలకు వాడుకోవాలని చూడటం నీచమైన చర్యని మండిపడ్డారు.

తప్పు చేసిన వాళ్లు ఏ పార్టీకీ చెందిన వాళ్లైన  శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.  మరోవైపు ఈ కేసులో తాను జోక్యం చేసుకున్నానని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  తాను కంచికచర్ల పోలీసులతో మాట్లాడినట్లు నిరూపిస్తే.. దేనికైన సిద్ధమని మంత్రి సురేష్ సవాల్ విసిరారు. చట్టం ముందు ఎవరైనా సమానమేనని, టీడీపీ నాయకులకు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటుగా మారిందటూ మంత్రి మండిపడ్డారు. మరి.. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ టీడీపీ నేతలకు చేసిన సవాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.