iDreamPost
android-app
ios-app

ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో YSRCP ప్రభంజనం.. 25 లోక్ సభ స్థానాలు!

ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో YSRCP ప్రభంజనం.. 25 లోక్ సభ స్థానాలు!

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ కూటమి పరిస్థితి ఏంటి? ఈటీజీ టైమ్స్ నౌ సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేని వాళ్లు చాలారోజులుగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫేజ్ 3 ఫలితాలను తాజాగా వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 లోక్ సభ స్థానాలను వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందంటూ ఈటీజీ టైమ్స్ నౌ సర్వేలో వెల్లడించారు.

25 స్థానాల్లో వైసీపీకి 24 నుంచి 25 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 0 నుంచి 1 సీటు, జనసేన ప్రభావం ఉండబోదని వెల్లడించారు. ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే.. వైసీపీకి 51.30 శాతం, తెలుగుదేశానికి 36.20, జనసేనకు 10.10 శాతం ఓట్లు, ఎన్డీఏకి 1.30 శాతం, ఇతరులకు 1.10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఇంక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు దక్కే అవకాశం ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కూటముల విషయానికి వస్తే.. ఎన్డీఏ కూటమికి 296 నుంచి 326 సీట్లు, ప్రతిపక్ష I.N.D.I.A. కూటమికి 160 నుంచి 190 సీట్లు, బీజేడీకి 12 నుంచి 14 లోక్ సభ స్థానాలు, ఇతరులకు 11 నుంచి 14 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఈ సర్వే ఫలితాలపై వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజల ఆదరణకు ఈ సర్వే ఒక నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రతిపక్షాల పేరిట ప్రభుత్వం బురద జల్లే వాళ్లకు ఈటీజీ టైమ్స్ నౌ సర్వే ఒక చెంప పెట్టు లాంటిదని చెబుతున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ మరింత బలపడిందని ఈ సర్వే చెబుతోంది. 25 ఎంపీ స్థానాలకు గానూ 2019లో 22 స్థానాలు దక్కించుకోగా.. ఈసారి 25 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పారు. అలాగే గత ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికల్లో దాదాపుగా ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ సర్వే ప్రకారం రుజువవుతోంది. అలాగే ఓటింగ్ కూడా ఈసారి టీడీపీకి తగ్గే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈ సర్వే వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.