iDreamPost
android-app
ios-app

నందిగం సురేశ్ పై జగన్ కున్న ప్రేమ తెలియదా.. కళ్లు మూసుకున్నారా?

YSRCP Counter To TDP: తెలుగుదేశం పార్టీ కుట్రలు, చేసే ప్రచారాలు ఎంత దారుణంగా ఉంటాయో మరోసారి రుజువైంది. ఈసారి కూడా వైసీపీ మీద బురద జల్లబోయి టీడీపీ అడ్డంగా దొరికిపోయింది.

YSRCP Counter To TDP: తెలుగుదేశం పార్టీ కుట్రలు, చేసే ప్రచారాలు ఎంత దారుణంగా ఉంటాయో మరోసారి రుజువైంది. ఈసారి కూడా వైసీపీ మీద బురద జల్లబోయి టీడీపీ అడ్డంగా దొరికిపోయింది.

నందిగం సురేశ్ పై జగన్ కున్న ప్రేమ తెలియదా.. కళ్లు మూసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. మే 13న ఎన్నికల జరగనున్న విషయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. మరోవైపు ఇవాళ అధికార వైసీపీ కూడా తమ 175 అభ్యర్థుల పేర్లు, వివరాలను వెల్లడించింది. దివంగత నేత వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రి సమాధికి నివాళులర్పంచి వైఎస్ జగన్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు, ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వాటిలో ఒక వీడియో తీసుకుని వారికి బాగా అలవాటు అయిన ఎడిటింగ్ జిమ్మిక్కులు చేసి వైసీపీ, వైఎస్ జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేసింది తెలుగు దేశం పార్టీ. టీడీపీ కుట్రను వైసీపీ తిప్పి కొట్టడమే కాకుండా.. మరోసారి వారి కుట్రపూరిత బుద్ధిని బయటపెట్టినట్లు అయ్యింది.

అసలు విషయం ఏంటంటే.. వైఎస్సార్ సమాధికి నివాళులర్పించే క్రమంలో పక్కన ఉన్న నందిగం సురేశ్ ని వైఎస్ జగన్ పక్కకు వెల్లిపోమన్నారు అంటూ ఒక వీడియో ఎడిట్ చేసి ఐటీడీపీ తమ ఖాతాలో పోస్ట్ చేసింది. జగన్ కు అసలు దళితులు అంటే పడదు అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ దుష్ర్పచారాన్ని వైసీపీ అధికార సోషల్ మీడియాలో వింగ్ తిప్పికొట్టడమే కాకుండా.. వారి కుట్రపూరిత బుద్ధి ఎలా ఉంటుందో కూడా మరోసారి రాష్ట్ర ప్రజలకు చాటిచెప్పింది. వాళ్లు కేవలం సగం వీడియో మాత్రమే కట్ చేసి వారి పైత్యాన్ని బయటపెట్టుకున్నారు. పూర్తి వీడియోని వైసీపీ తమ అధికార ఖాతాలో పోస్ట్ చేసింది.

నందిగం సురేశ్ కు రాజకీయాలకు సంబంధం లేదు. తనకోసం మూడ్రోజులు నిల్చున్నాడని తనని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తి జగన్. 2019 ఎన్నికలు జగన్ కు జీవన్మరణ సంకటం అని అందరికీ తెలుసు. అలాంటి సమయంలోనే నందిగం సురేశ్ కు ఎంపీ టికెట్ ఇచ్చారు. నందిగం సురేశ్ గెలుపు బాధ్యతను కూడా తీసుకున్నారు. వైఎస్ జగన్ తో ట్రావెల్ చేసే వారిలో రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. నందిగం సురేశ్ లాంటి రాజకీయ నేపథ్యంలేని వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు. తన పక్కన కూర్చోబెట్టుకుని ఎంపీ అభ్యర్థుల పేర్లు ఎవరితోనైనా చదివించొచ్చు. కానీ, ఒక ఎస్సీ నేత అయిన నందిగం సురేశ్ కు వైఎస్ జగన్ ఇచ్చిన గౌరవం, ప్రాధాన్యత అది. ఇదంతా చూసిన తర్వాత కూడా తప్పుడు ప్రచారాలు చేయడానికి టీడీపీ ప్రయత్నించడం నిజంగా హాస్యాస్పదం అనే చెప్పాలి.

“వైసీపీలో నందిగం సురేశ్ కి సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కల్పించడంతో ఓర్వలేక తప్పుడు ప్రచారంతో విషం చిమ్ముతున్నారే.. దళిత సమాజం నిన్ను క్షమిస్తుందా లోకేశ్?” అంటూ ఆధారాలు చూపించడమే కాకుండా.. టీడీపీ వక్ర బుద్ధిని నెట్టింట లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ నెట్టింట వైసీపీ పార్టీ ఎండ గట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇప్పటికీ చంద్రబాబు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారు అనే భ్రమలోనే ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరి.. టీడీపీ దుష్ర్పచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.