iDreamPost
android-app
ios-app

TDP ఆర్భాటం.. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది: విజయ సాయిరెడ్డి

  • Published Aug 24, 2023 | 8:21 PM Updated Updated Jan 06, 2024 | 6:21 PM

చంద్రబాబు- లోకేశ్ అభివృద్ధి నిరోధకులు అంటూ విజయసాయిరెడ్డి అభివర్ణించారు. చంద్రయాన్ 3 సక్సెస్ ని చంద్రబాబు విజయంలా ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తోందన్నారు. అది చూస్తే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు- లోకేశ్ అభివృద్ధి నిరోధకులు అంటూ విజయసాయిరెడ్డి అభివర్ణించారు. చంద్రయాన్ 3 సక్సెస్ ని చంద్రబాబు విజయంలా ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తోందన్నారు. అది చూస్తే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

  • Published Aug 24, 2023 | 8:21 PMUpdated Jan 06, 2024 | 6:21 PM
TDP ఆర్భాటం.. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉంది: విజయ సాయిరెడ్డి

నరసరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు, లోకేశ్, టీడీపీలకు ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. చంద్రబాబు- లోకేశ్ అభివృద్ధి నిరోధకులు అంటూ విజయసాయిరెడ్డి అభివర్ణించారు. చంద్రయాన్ 3 సక్సెస్ ని చంద్రబాబు విజయంలా ఎల్లో మీడియా ప్రొజెక్ట్ చేస్తోందన్నారు. అది చూస్తే ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉందంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి క్రెడిబిలిటీ లేదని.. ఆ పార్టీలో అంతా సంఘ విద్రోహ శక్తులే అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

“ఊళ్లో పెళ్ళికి కుక్కల హడావిడి చేసినట్లు చంద్రయాన్ సక్సెస్ పై చంద్రబాబు, ఎల్లో మీడియా హడావుడి చేస్తున్నాయి. అక్కడ చంద్రయాన్ సక్సెస్ తు ఇక్కడ చంద్రబాబు సక్సెస్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు చంద్రయాన్ కు చంద్రబాబుకు ఏం సంబంధం ఉంది? చంద్రయాన్ కు టీడీపీకి ఏం సంబంధం ఉంది? రాజకీయంగా ఫ్రస్టేషన్ లో ఉన్న చంద్రబాబు ఏం చేయాలో తెలియక ఇలాంటి భజనలు చేయించుకుంటున్నారు వైయస్ఆర్ పార్టీ డీటీబీనే నమ్ముకుంది. చంద్రబాబుకు ఒక సలహా ఇస్తాను.. టీడీపీ పేరును జీపీటీ(గెలిస్తే తంతా) పార్టీగా మార్చిచితే బాగుంటుంది. గెలిస్తే అందిరినీ తంతాం, కొడతాం, బట్టలు విప్పుతాం అని తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే మాటలు మాట్లడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతా.. అసలు మీరు గెలిచే అవకాశం ఉందా? ఈ భాష ఏంటి? అసభ్య పదజాలం ఏంటీ? టీడీపీ వాళ్లందరు సంఘ విద్రోహ శక్తులే” అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

పార్టీ అన్నాక భిన్నాభిప్రాయాలు సహజమే అంటూ చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాల్లో ఏకాభిప్రాయాన్ని సాధించాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. 2024లో 24 నుంచి 25 లోక్ సభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయన్నారు. కాషాయంలో ఉన్న ఎల్లో బ్యాచ్ కి టీడీపీలో రెడ్ జోన్ లో ఉంటే నిద్రపట్టడం లేదన్నారు. విజన్ 2047 చంద్రబాబుది కాదని.. నీతిఆయోగ్ ది అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్న వార్డులో కూడా వైసీపీనే విజయం సాధించిందన్నారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş