iDreamPost
android-app
ios-app

టిక్కెట్ల విషయంలో TDP రిలాక్స్.. పవన్ కు అంత సీన్ లేదట!

ఏపీలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సీట్లపై టీడీపీలో ఆందోళన ఉండేది. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలతో టీడీపీ రాలాక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సీట్లపై టీడీపీలో ఆందోళన ఉండేది. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలతో టీడీపీ రాలాక్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

టిక్కెట్ల విషయంలో TDP రిలాక్స్.. పవన్ కు అంత సీన్ లేదట!

ఏపీ చంద్రబాబు అరెస్టు తరువాత రాజకీయల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అప్పటి వరకు జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అనే సందేహం ఉండేది. కానీ రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీ నేతల్లో ఓ భయం పట్టుకుంది. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలనే టెన్షన్ వారిలో ఉండేది. ముఖ్యంగా తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సీట్లపై టీడీపీలో ఆందోళన ఉండేది. కారణం.. జనసేన తెలంగాణలో 32 స్థానాల్లో పోటీచేస్తాని ప్రకటించింది. అయితే ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలతో టీడీపీ రాలాక్స్ అయింది. ఏపీలో టికెట్ల విషయంలో పవన్ కల్యాణ్ కు అంత సీన్ లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంట.

తెలంగాణలో జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఈ క్రమంలో 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన పవన్.. చివరకు 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పవన్ అడుగుల్ని, ఆయన వ్యూహాల్ని టీడీపీ జాగ్రత్తగా గమనిస్తూ వచ్చింది.  జనసేన రాజకీయ పంథాను చూసి టీడీపీ నేతలు.. లోలోపల నవ్వుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 32 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు కేవలం 8 సీట్లకే పరిమితం కావడం అందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏపీలో ఎన్ని సీట్లు అడుగుతారనే టెన్షన్ టీడీపీలో ఉండిది.

అంతేకాక గౌరవప్రదమైన సీట్లు ఇవ్వకపోతే జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. దీంతో టీడీపీ నేతల్లో ఆందోళ మరింత ఎక్కువైంది. అయితే తాజాగా తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య చూసిన తరువాత టీడీపీ నేతలు రిలాక్స్ అయ్యారంట. ఇంతకాలం పవన్ కల్యాణ్ కనీసం 40 సీట్లైన డిమాండ్  చేస్తారనే భయం ఉండేది. 25-30సీట్లైనా జనసేనాకు ఇవ్వాల్సి వస్తుందని,  తమలో ఎవరం త్యాగం చేయాల్లో అని తెగ బాధపడేవారని టాక్. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ పసుపు నేతల్లో పోయింది.  10 నుంచి 15 సీట్లకు మించి జనసేనకు ఇచ్చే ప్రశ్నే లేదని టీడీపీ నేతలు అంటున్నారంట.

కారణం పవన్ కల్యాణ్ కు రాజకీయంగా బేరాలు ఆడటం  తెలియదని.. తెలంగాణలో ఆయన అనుసరించిన విధానం చెప్పకనే చెబుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అవసరమైతే తమ వాళ్లనే జనసేనలోకి పంపి.. గతంలో మాదిరి టికెట్లు ఇప్పించినట్లు ఇస్తామని కొందరు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని టాక్. మొత్తంగా తెలంగాణలో జనసేన పోటీ చేస్తున్న సీట్లతో..ఏపీలో టీడీపీ సంతోషంలో ఉందని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.