Arjun Suravaram
టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఉమ్మడి కార్యాచరణను కూడా ప్రకటించారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత సీన్ అంతామారిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోను విజయవంతంగా మర్చిపోయరనే టాక్ వినిపిస్తోంది.
టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఉమ్మడి కార్యాచరణను కూడా ప్రకటించారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత సీన్ అంతామారిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోను విజయవంతంగా మర్చిపోయరనే టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు తరువాత ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారాయి. అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో సాగుతుందో. ఇటీవలే చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే అంతకు ముందే జనసేన అధినేత కీలక ప్రకటన చేశారు. టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఉమ్మడి కార్యాచరణను కూడా ప్రకటించారు. అయితే చంద్రబాబు అరెస్టు తరువాత సీన్ అంతామారిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి మేనిఫెస్టోను విజయవంతంగా మర్చిపోయారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతవారం రాజమండ్రి వేదికగా టీడీపీ-జనసేనలు ఉమ్మడి సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ఈ రెండు పార్టీలు ఘనంగా ఓ ప్రకటన చేశాయి. నవంబర్ 1వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో అంటూ ప్రకటించాయి. కానీ దాన్ని టీడీపీ-జనసేనలు మరిచిపోయినట్లున్నాయని తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీ పోయి 2వ తేదీ వచ్చినా ఉమ్మడి మేనిఫెస్టో ఊసే లేకుండా పోయింది. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని చూసిన ఇరు పార్టీల అభిమానులకు నిరాశే ఎదురైందనే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టు తరువాత ఇరు పార్టీల నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి.
ఇరు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు అక్టోబర్ 25వ తేదీన రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టి మరీ లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ప్రకటించారు. ఆ సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నాడు కాబట్టి మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించేశారు. ఆ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఇటలీకి వెళ్లాడు. అలానే ఆ ఉమ్మడి మేనిఫెస్టోకు కోరస్ ఇచ్చిన లోకేష్ కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక జైలు నుంచి విడుదలైన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ అయిపోయారు. మరి మేనిఫెస్టో గురించి ఎవరైనా అడిగినా అంతే సంగతలు అన్నట్లు ఉంది. టీడీపీ-జనసేనల ప్రకటనపై వైఎస్సార్‌సీపీ నేతల మండిపడుతోన్నారు. మేనిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలు టీడీపీ అంటూ వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది. మరి.. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.