iDreamPost
android-app
ios-app

ఆ ఎన్నికల విషయంలో తేల్చుకోలేకపోతున్న లోకేశ్ !

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ బాధ్యతలను లోకేశ్ చూసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే లోకేశ్ ఓ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక అయోమాయానికి గురైనట్లు పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ బాధ్యతలను లోకేశ్ చూసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే లోకేశ్ ఓ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక అయోమాయానికి గురైనట్లు పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది.

ఆ ఎన్నికల విషయంలో తేల్చుకోలేకపోతున్న లోకేశ్ !

తెలంగాణలో ఎన్నికల సందండి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే చాలా వరకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమరంలో మంచి దూకుడు మీద ఉంది. మరోవైపు ఈ సారి తెలంగాణల్లో ఎన్నికల్లో గట్టి పోటీ నడుస్తుందన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలంగాణలో టీడీపీ పరిస్థితి వింతగా ఉంది. అలానే ఈ తెలంగాణ ఎన్నికలు లోకేశ్ ను అమోయమానికి గురి చేసినట్లు, ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నందమూరి తారక రామరావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏళ్ల తరబడి పాలిస్తున్న కాంగ్రెస్ ను ఓడించి.. విజయం సాధించింది. ఆ తరువాత జాతీయ స్థాయిలో టీడీపీ కీలకంగా వ్యవహరించి. ఇక ఉమ్మడి ఏపీలో అయితే బలమైన పార్టీగా టీడీపీ ఉంది. ప్రత్యేకించి తెలంగాణలో టీడీపీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. అందుకే బీఆర్ఎస్ హవాని తట్టుకుని 2014 ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెల్చుచుకుంది. 2018లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసి ఓటమి చవిచూసింది. ఇక తాజాగా ఎన్నికలకు తెలంగాణ టీడీపీ అమోయమంలో ఉందని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటంతో పార్టీ బాధ్యతలను ఆయన తనయుడు లోకేశ్ చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో బీజేపీతో చేయి కలపాలని టీడీపీ భావిస్తుంది. కానీ ఏపీలోని పరిస్థితులు అందుకు అడ్డంకిగా మారాయి.

అయినా కూడా బీజేపీలో ఉన్న సీఎం రమేశ్, సృజన చౌదరి వంటి టీడీపీకి చెందిన మాజీ నేతల సహకారంతో ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయోచ్చని ఆ పార్టీకి చెందిన కొందరు అభిప్రాయ పడ్డారు. కాంగ్రెస్ ను గెలిపించి.. బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్ సీపీలకు గుణపాఠం చెబుదామని మరో వర్గం అన్నట్లు టాక్. ఇలా రెండు వర్గాలు భిన్న అభిప్రాయాలు చెబుతుండటంతో ఏటు తేల్చుకులోనే స్థితిలోలోకేశ్ పడ్డాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనివార్య కారణాలతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉండటంతో ఇలా లోకేశ్ కి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉన్న సమయంలో గడుపుతున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.