అసలు రాజ్యసభకు నామినేషన్ అందుకోవాలంటే కావాల్సిన అర్హతేంటి. ఆ పదవి వచ్చాక దేశం పట్ల సమాజం పట్ల మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన అర్హుడని బిజెపి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది. ఇళయరాజా గురించి […]
రాజ్యసభ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలనూ ప్రకటిస్తారు. ఈ సందర్భంగా పలు పార్టీల అభ్యర్థులను ప్రకటించడంతో వారు నామినేషన్లను దాఖలు చేయగా, నామినేషన్లకు గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, అందులో 41 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 14 మంది ఎన్నికయ్యారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు. మహారాష్ట్రలో 6, రాజస్తాన్‌లో 4, కర్ణాటకలో 4, హర్యాణాలో […]
పెద్దల సభ ఎన్నికలకు నగారా మోగింది. ఆరు రాష్ట్రాలలో ఖాళీ కాబోతున్న 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పంజాబ్‌లో ఐదు, కేరళలో మూడు, అస్సాంలో రెండు, హిమాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురలో ఒక్కొక్క స్థానం చొప్పన ఏప్రిల్‌లో ఖాళీ కాబోతున్నాయి. ఇదీ షెడ్యూల్.. – నామినేషన్‌కు చివరి తేదీ మార్చి 21 – నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు 24 – ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి మార్చి 31
ఎన్డీఏ – 2 అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సమావేశాల్లో ఈ స్థాయిలో గందరగోళం చెలరేగడం మొదటిసారి. రాజ్యసభలో సంఖ్యాబలం లేకున్నా కూడా బీజేపీ తన రాజకీయ చతురత, తటస్థ రాజకీయ పార్టీల అవసరాల వల్ల బిల్లులు పాస్ అవుతున్నాయి. అయితే నూతనంగా తెచ్చిన వ్యవసాయ బిల్లుపై మాత్రం కథ అడ్డం తిరిగింది. ఊహించని విధంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్డీఏ భాగస్వామి అయిన శిరోమణి అకాళిదల్ నిర్ణయం తీసుకోవడం, ఆ పార్టీ నేత హర్ సిమ్రత్ […]
రాజ్యసభకు ఎన్నిక కావడంతో మంత్రి పదవులకు మోపీదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్‌లు సమర్పించిన రాజీనామాలను రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ కొద్దిసేటి క్రితం ఆమోదించారు. ఈ నెల 22వ తేదీన నూతనంగా ఎన్నికలైన 55 మంది రాజ్యసభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పక్షం రోజుల కిందట మోపీదేవి, పిల్లి సుభాష్ చంద్రబోష్‌లు సమర్పించిన రాజీనామాలకు గవర్నర్ ఆమోదించారు. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె, తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గాల నుంచి […]
రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి అగ్రనాయకత్వం భారీ స్థాయిలో కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.జ్యోతిరాదిత్య సింధియా భాటలోనే రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ నడవనున్నాడని ఊహాగానాలు షికారు చేస్తున్న సమయంలో రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయంపై విశ్వాసాన్ని ప్రకటించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాడు. జూన్ 19 న రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులు విజయం సాధిస్తారని రాజస్థాన్ […]
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మరి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలవగా.. కర్ఫ్యూలు, లాక్డౌన్లతో సామాజిక వ్యవస్థ స్తంభించింది. తాజాగా రాజకీయ వ్యవస్థపై కూడా కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశ రాజకీయాలు బంద్ అవుతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా.. వచ్చే నెల 4వ తేదీ వరకు జరగాల్సిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్నటితో అర్థంతరంగా ముగిశాయి. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఉభయ […]
రాజ్యసభలో ఖాళీ అయిన 55 స్థానాల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 37 స్థానాలు ఏకగ్రీవం కాగా 18 స్థానాల్లో పోటీ అనివార్యమైంది. ఈ నెల 26వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. 37 స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలు కావడంతో అవన్నీ ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథ్వాలే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్ తదితరులు […]
ఆంధ్రప్రదేశ్ కోటాలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల కోసం జరుగుతున్న ఎన్నికల్లో అయిదుగురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 151 అసెంబ్లీ స్థానాలున్న వైసిపి ఏకపక్షంగా నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉండడంతో ఆపార్టీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, పరిమళ్ నత్వాని ని బరిలోకి దించింది. అయితే అనూహ్యంగా తెలుగుదేశం ఐదో అభ్యర్థిని రంగంలో దించడంతో ఏప్రిల్ 26 న […]
భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్రపతి కోటాలోని నామినేటెడ్ సభ్యులలో ఒక రాజ్యసభ సభ్యుడు పదవీ విరమణ కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి రంజన్ గొగోయిని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కు నామినేట్ చేసినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో జస్టిస్ గొగోయ్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ […]