iDreamPost
android-app
ios-app

చంద్రబాబు గొప్పలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

  • Published Sep 20, 2023 | 6:56 PM Updated Updated Sep 20, 2023 | 6:56 PM
  • Published Sep 20, 2023 | 6:56 PMUpdated Sep 20, 2023 | 6:56 PM
చంద్రబాబు గొప్పలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా చంద్రబాబుపై మరో కేసు దాఖలైంది. ఫైబర్ నెట్ స్కాం కేసులో సీఐడీ బాబును ప్రధాన ముద్దాయిగా తేల్చింది. ఈ క్రమంలోనే బాబుపై పిటి వారెంట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సీఐడీ. ఆ పిటీషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇక చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బాబుపై రాజ్యసభ వేదికగా సెటైర్లు వేశాడు. అన్నీ నేనే కనిపెట్టాను అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ వివరాలు మీకోసం..

చంద్రబాబు మాట్లాడిన ప్రతిసారి ప్రజాభివృద్ధికోసం పాటుపడ్డానని, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో అభివృద్ధి చేశానని ప్రగల్భాలు పలకడం అందరికి తెలిసిన విషయమే. హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చింది నేనే అని, ఐటీ రంగం తన వల్లే అభివృద్ధి చెందిందని బాబు గొప్పలు చెప్పుకోవడం శరమామూలే. అరచేతిలో స్వర్గం చూపించి మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టే మోసకారి బాబు గురించి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక చంద్రబాబు గొప్పలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో బాబు వ్యవహారాన్ని ఎండగట్టారు.

చంద్రయాన్ విజయంపై జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌ను తానే కనుగొన్నానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అదే గనక నిజమైతే వాటి పేటెంట్‌ హక్కుల కోసం కేంద్రం ప్రయత్నించాలని కోరారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి నేను గురువు అంటారు. అంతరిక్ష పరిశోధనలకు నాంది పలికింది నేనే అని చెప్పుకుంటారని, చంద్రబాబు కనిపెట్టిన ఆవిష్కరణలకు పేటెంట్‌ తీసుకుంటే భారత్‌కు కోట్లలో ఆదాయం గ్యారంటీ అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశాడు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet