iDreamPost
android-app
ios-app

వీడియో: రాజ్యసభలో కోపంతో ఊగిపోయిన అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌!

  • Published Jul 30, 2024 | 12:36 PM Updated Updated Jul 30, 2024 | 12:54 PM

Jaya Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాజ్య సభ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె సోమవారం ఓ విషయంలో ఆవేశానికి గురయ్యారు.

Jaya Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె రాజ్య సభ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె సోమవారం ఓ విషయంలో ఆవేశానికి గురయ్యారు.

  • Published Jul 30, 2024 | 12:36 PMUpdated Jul 30, 2024 | 12:54 PM
వీడియో: రాజ్యసభలో కోపంతో ఊగిపోయిన అమితాబ్‌ భార్య జయా బచ్చన్‌!

సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన  ఇష్యూలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలు సీరియస్ అయినా, కామెడీ చేసినా.. అలాంటి వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అదే సమయంలో కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బిగ్ బి అమితాబ్ సతీమణి ఎంపీ జయా బచ్చన్ ఆవేశానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు ఆమె ఎందుకు సీరియస్ అయ్యారు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను భర్త పేరుతో కలిపి పిలవడంపై అసహనం వ్యక్తం చేశారు. తన భర్త పేరుతో కాకుండా జయా బచ్చన్ అని పిలిస్తే చాలని రాజ్యసభ ఛైర్మన్ తో  తెలిపారు. ఆమె ఎస్పీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన సంగతి తెలిసింది. ఇది ఇలా ఉంటే.. సోమవారం రాజ్యసభలో ఆమెను మాట్లాడవల్సిందిగా రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అమితాబ్ బచ్చన్ పేరును ప్రస్తావించారు. ‘శ్రీమతి జయా అమితాబ్ బచ్చన్  జీ, ప్లీజ్’ అంటూ సంభోదించారు.

అయితే అలా ఛైర్మన్ తన భర్త పేరుతో కలిపి పిలవడంపై జయా బచ్చన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను జయా బచ్చన్ అని పిలిస్తే చాలని స్పీకర్ కు తెలిపారు. అయితే  ఈ అంశంపై డిప్యూటీ ఛైర్మన్ స్పందిస్తూ.. ఆమె పేరు పార్లమెంట్ రికార్డులో అధికారికంగా జయా అమితాబ్ బచ్చన్ అని ఉందని తెలిపారు.  అంతేకాక ఆ రికార్డులో ఎలా రాసి ఉందో అలానే తాను పిలిచినట్లు డిప్యూటీ ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భర్త పేరు లేకుండా గుర్తించడానికి మహిళలకు వారి సొంత ఉనికి, సాధించిన విజయాలు ఉండవా అంటూ ఆమె ఆవేశంగా మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet