జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో భారత సైనికులకు చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబుతో పాటు 21 మంది భారత సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో చైనా కంపెనీలను బహిష్కరించాలన్న వాదన ఊపందుకుంది. బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ అన్న నినాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చైనా కంపెనీలకు షాకిచ్చారు. వివరాల్లోకి వెళితే చైనా సైనికులు […]
బిజెపికి కౌంటరించిన కాంగ్రెస్ చైనా విషయంలో అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒక పార్టీపై మరొక పార్టీ ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. చైనాతో మీకు సంబంధాలు ఉన్నాయంటే…మీకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. బిజెపి తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రంగంలోకి దిగి కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంటే..కాంగ్రెస్కు నుంచి ఆ పార్టీ రాజ్యసభ ఎంపి, అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ రంగంలోకి దిగి బిజెపి […]
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో శంకర్ సింగ్ వాఘేలాకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కాగా గుజరాత్ అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శంకర్ సింగ్ వాఘేలా ప్రజాశక్తి మోర్చా పేరిట కొత్త పార్టీని ఏర్పాటు […]
ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఆకలి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించేలా చేయగల శక్తి ఆకలికి ఉంది. ఒక మనిషి తన ప్రాణాలను నిలుపుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాటం చేసేలా ఆకలి చేయగలదు. ఇప్పుడీ పరిస్థితి వలస కూలీలకు ఎదురవుతుంది. కరోనా విజృంభిస్తున్న కొత్తలో ముంబయి మహా నగరంలో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరడానికి చేయని ప్రయత్నాలు లేవు. కాలి నడకన కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రేకెత్తేలా […]
పాములపర్తి వెంకట నరసింహా రావు… ప్రధాని కాకుండా ఉంటే ఈ పేరు ఎంతమందికి గుర్తుండేది?ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు పేర్లు అన్నీ ఎంతమందికి గుర్తున్నాయి… ? “యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్” అని ఏ ప్రధానినైన అనటం ఆ పదవికి అవమానం..ఒకరు వద్దన్న తరువాత మరొకరు పదవిలోకి రావటం యాక్సిడెంటల్ కాదు.. అది అనివార్యత … పీవీ విషయంలో కూడా అంతే . పీవీ ప్రధాని ఎలా అయ్యారు? 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం బీజేపీ మద్దతుతో జనతాదళ్ నేత […]
స్మృతి ఇరానీ అరుదైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే స్మృతి ఇరానీ ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన మోడల్ అని చాలామందికి తెలియదు. కాగా తాజాగా స్మృతి ఇరానీ మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న అరుదైన వీడియోను ఆమె స్నేహితురాలు, నిర్మాత ఏక్తా కపూర్ షేర్ చేశారు. ఏక్తా కపూర్ షేర్ చేసిన స్మృతి ఇరానీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
కరోనా వైరస్ విజృంభణ యావత్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. ఇది సామాన్యులు నుండి రాజకీయ నేతలూ, సెలబ్రిటీలూ, ఉన్నతాధికారుల వరకు అందరికీ ఎవరినీ వదలటం లేదు. వివిధ రాష్ట్రాల్లో మంత్రులకు కూడా కరోనా సోకింది. తమిళనాడులోని డిఎంకె, పశ్చిమ బెంగాల్ లోని తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కూడా ఎమ్మెల్యేలకు, రాజకీయ నేతలకు కరోనా సోకింది. ఇలా ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను […]
దేశంలో గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధర పెరిగుతున్నాయి. దీనిపై ఒకపక్క ప్రజలు, మరోపక్క ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కాలంలో సంధిట్లో సడేమియా అన్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెంచేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ కంటే డీజిల్ ధర ఎక్కువ ఉంది. ఈ విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రతిపక్షాలు ఆందోళన చేద్దామన్నా లాక్ డౌన్ కారణంగా అందుకు అనుమతి లేదు. […]
వ్యాక్సిన్ వచ్చే వరకూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్తే మాస్కులు పెట్టుకోవడం, దూరం పాటించడం తప్పనిసరి. సూది మందు వచ్చే వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే అని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వలస కూలీల కోసం రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ఆయన ఉత్తర ప్రదేశ్ లో ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కట్టడికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటున్న […]
ఓ వైపు కరోనా కేసులు ఐదు లక్షలు దాటాక మరణాల సంఖ్య 15 వేలకు దగ్గరగా ఉన్నది. ఈ నేపథ్యంలో ”ఎవరు ఏమనుకున్నా మాకేంటీ మాకు బీహార్ గద్దెపైనే దృష్టి” అన్నట్టుగా మోడీ,అమిత్ షాలు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్న బిజెపి పెద్దలకు మాత్రం త్వరలో బీహార్లో జరగబోయే ఎన్నికలవైపే దృష్టి పెట్టారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను గద్దెదింపటానికి బిజెపి చేసిన ప్రయత్నాలు అన్నీ […]