iDreamPost
android-app
ios-app

వీడియో: భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు: రాజగోపాల్ రెడ్డి

Raj Gopal Reddy Comments On Uttam Kumar Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Raj Gopal Reddy Comments On Uttam Kumar Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వీడియో: భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు: రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని  రాజగోపాల్ రెడ్డి జోష్యం చెప్పారు. ఇక తాజాగా కోమటి రెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి.

శుక్రవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నీటి పారుదల పనులపై రాష్ట్రమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ ప్రాంతంలోని నీటి పారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. అంతేకాక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రి అయ్యారని, భవిష్యత్ లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందని, కాబట్టి ఉత్తమ్ సీఎం అవుతారని తెలిపారు. ఇప్పటికే ఒక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావడం మిస్సయ్యారని, ఈ సారి పక్కా అంటూ రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను ఏం చెప్పిన జరుగుతుందని తన బాల్యం నుంచే తన తల్లి చెబుతుండేవారని ఆయన తెలిపారు.

ఇదే సమయంలో నియోజవర్గంలోని పలు అభివృద్ధి పనుల గురించి ప్రస్తావించాడు. బునాదిగాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాల్వను రీడిజైన్ చేయాలని ఆయన కోరారు. ఈ కాల్వ వెడల్పును పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయకట్టు కూడా రెండింతలు అవుతుందని, అధికారులు దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. కానీ.. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో ఆయన మాటల వెనక ఆంతర్యం ఏంటనే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి..రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.