iDreamPost
android-app
ios-app

బిగ్ బ్రేకింగ్: మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి!

T Harish Rao: మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో ఈ వాహనంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరావు కూడా ఉన్నారు. ఇంతకీ ఎక్కడ జరిగిదంటే..

T Harish Rao: మాజీ మంత్రి , సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఇదే సమయంలో ఈ వాహనంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరావు కూడా ఉన్నారు. ఇంతకీ ఎక్కడ జరిగిదంటే..

బిగ్ బ్రేకింగ్: మాజీ మంత్రి హరీశ్ రావు వాహనంపై రాళ్ల దాడి!

గతం రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొట్టాయి. ఈ క్రమంలోనే ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయ్యం అయ్యాయి. ఊహించని స్థాయిలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇది ఇలాంటే.. వరదల ప్రభావిత ప్రాంతాలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతలు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మంలో ఉద్రికత్త చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్సించే క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈదాడి జరిగిన సమయంలో కారులో హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు నామా నాగేశ్వరావు, సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

మంగళవారం ఖమ్మం జిల్లాలోని  మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు బృందం పర్యటించింది.ఇలా బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్న వేళ మంచి ఖమ్మంలోని కంటి నగర్‌ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరావులు  వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శిస్తుండగా దాడి జరిగింది. బీఆర్ఎస్ నేతలను వాహనాల్లో నుంచి దిగకుండ..కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, హరీశ్ రావు వాహనాలపై కొందరు రాళ్ల దాడి చేశారు.  దీంతో పలువురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు.

బాధితులను పరామర్శించనివ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలే దాడులకు దిగుతున్నారని బీఆర్ఎస్ నేతల ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించుకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవాలని కోరుతుంటే తమపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఈ పర్యటనలో మాజీ మంత్రులు హారీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఖమ్మం మున్నేరు వరద బాధితులను పరామర్శించారు. వరద సహాయక చర్యల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, ముంపు ప్రాంతాల ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మరి.. బీఆర్ఎస్ నేతల వాహనాలపై రాళ్ల దాడి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.