iDreamPost
android-app
ios-app

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు..నోటిఫికేషన్ పై EC కీలక అప్డేట్!

Telangana Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది. గురువారం ఎస్ఈసీ ..కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సర్పంచ్ ఎన్నికల గురించి కీలక విషయాలను వెల్లడించారు.

Telangana Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక అప్ డేట్ ఇచ్చింది. గురువారం ఎస్ఈసీ ..కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సర్పంచ్ ఎన్నికల గురించి కీలక విషయాలను వెల్లడించారు.

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు..నోటిఫికేషన్ పై EC కీలక అప్డేట్!

గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపికైన ప్రజాప్రతినిధుల కీలక పాత్ర ఉంటుంది. అందుకే సర్పంచ్, ఎంపిటీసీ, జడ్పీటీసీ వంటి ఎన్నికలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇలానే తెలంగాణలో కూడా సర్పంచ్ ఎన్నికల గురించి  ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా ఆశావాహులు సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా  అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైనా నోటిఫికేష్ రావచ్చనే భావనతో ఇప్పటి నుంచే గ్రామాల్లో పలువురు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. 2024 ఫిబ్రవరితో సర్పంచ్ లో పదవీ కాలం ముగిసింది. దీంతో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక అప్ డేట్ ఇచ్చింది

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కీలక విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే  పంచాయతీ  ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు  ఆయన వెల్లడించారు. గురువారం ఆగష్టు 29న పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మూడు దశల్లో బ్యాలెట్ బాక్స్ విధానంలోనే ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తీసుకున్న ఓటర్ల జాబితా ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా జాబితాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీ ఎలక్షన్ కోడ్ ను కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలను సెప్టెంబర్ 6న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచురించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మండల, జిల్లా స్థాయిల్లోని పొలిటికల్ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించాలని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ముసాయిదా జాబితాల్లోని ఏవైనా తప్పులుంటే సెప్టెంబర్ 13న గ్రామ పంచాయతీ అధికారులు ఓటర్ల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు తీసుకోవాలని సూచించార. ఓటర్ల జాబితా సవరణ అనంతరం వచ్చే నెల 21న తుది లిస్టు ప్రచురించాలని స్పష్టం చేశారు. ఇక పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్లకు సంబంధించి వివిధ కార్యక్రమాలు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,991 గ్రామ పంచాయాతీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. అందుకే మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించినట్లు వెల్లడించారు. మరి…రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.