తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలో గెలుపు సమీకరణాలతో పాటు ఓటమి సమీకరణాలు కూడా ఆసక్తిగా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయమని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసి తీరుతామని ప్రకటనలు గుప్పించే బీజేపీ నేతలు నాగార్జున సాగర్ కు వచ్చేసరికి చతికిల పడ్డారు. దుబ్బాక నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికల వరకూ విజయ ప్రస్థానం సాగించిన బీజేపీ, నిన్న, మొన్న జరిగిన పట్టభద్రలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార […]
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో కారు హై స్పీడు తో దూసుకెళ్తోంది. కడపటి వార్తలు అందేసరికి 12వ రౌండ్లు పూర్తి కాగా టీఆర్ఎస్ స్పష్టమూన ఆధిక్యతతో దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీలో ఉండడంతో అంచనాలు పెరిగాయి. తెలంగాణలో ఆ పార్టీకి ప్రస్తుతం కలిసి రావడం లేదని వరుస ఎన్నికలు తెలియజేసినప్పటికీ నాగార్జునసాగర్ లో జానారెడ్డి ప్రభావం పని చేస్తుందని భావించారు. దీంతో విభేదాలను సైతం పక్కనబెట్టి సీనియర్లు అందరూ జానారెడ్డి గెలుపు కోసం […]
రేవంత్ రెడ్డి.. మంచి మాటకారి. ప్రస్తుతం తెలంగాణలో ఫైర్ బ్రాండ్. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తారు. కాంగ్రెస్ లో చేరి.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. పీసీసీ రేసులో ఉన్నారు. నాగార్జున సాగర్ ఎన్నికల్లో జానారెడ్డి తరఫున ప్రచారం గట్టిగానే చేశారు. ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు.. ఈనెల 15న కీలక కామెంట్లు చేశారు. ‘‘17వ తారీఖున పోలింగ్ పూర్తయ్యాక.. మంత్రులు, ఇన్ చార్జ్ లుగా ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలకు వెళ్లిపోతారు. […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 77 మంది 128 నామినేషన్లు దాఖలు చేయగా.. ఈ రోజు వాటన్నింటినీ రిటర్నింగ్ అధికారి పరిశీలించారు. 77 మంది అభ్యర్థుల్లో 17 మంది నామినేషన్లు తిరష్కరణకు గురయ్యాయి. ఇందులో బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జి నివేదితా రెడ్డితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సహా స్వతంత్రులు 15 మంది ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానా […]
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు, ఆ ప్రాంతంపై గట్టి పట్టు ఉన్న జానారెడ్డి పోటీ ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. […]
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అక్కడ పోటీ చేయాలనుకునేవారు, రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక మార్చి నెలలో జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏపీ రాష్ట్రంలోని తిరుపతి ఎంపీ దుర్గాప్రసాదరావు సెప్టెంబరు చివరి వారంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఆ లోక్సభ స్థానానికి మార్చిలో ఉప ఎన్నిక జరిగితే, దానితోపాటే నాగార్జునసాగర్ […]
వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది భారతీయ జనతా పార్టీ. గల్లీ నేతల నుంచి ఢిల్లీ నేతల వరకు అందరిదీ ఒకే స్టైల్. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కాంట్రవర్సీకి తెరతీస్తూనే ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు నగరంలో అలజడికి కారణమయ్యాయి. ఓటు బ్యాంకు రాజకీయాల్లో రాటుదేలుతున్న కాషాయపార్టీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరంభించిన సర్జికల్ […]
కేసీఆర్ గుణపాఠం నేర్చుకున్నట్టే కనిపిస్తోంది. తొలుత దుబ్బాకలో ఎదురుదెబ్బ కారణంగా ఆయన తేరుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బహిరంగసభ నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు అనివార్యం అయిన తరుణంలో ఇప్పటి నుంచే పావులు కదిపేందుకు సిద్దమవుతున్నారు. వ్యూహాలకు పదును పెడుతున్నారు. తన మార్క్ రాజకీయాలకు తెరలేపుతున్నారు. తమ సిట్టింగ్ సీటు మరోసారి చేజారిపోకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత ప్రజలకు […]
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలు పరిమితికి మించి ఏప్రిల్ మొదటి వారంలో కూడా నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో ప్రస్తుతం ఉన్న నీటి మట్టాలపై కృష్ణా బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టానికి దిగువకు నీటి మట్టాలు పడిపోగా.. నీటి వినియోగం సైతం గణనీయంగా పెరిగింది. ఈ నెపధ్యంలో రానున్న వేసవిలొ తాగు నీటి అవసరాలకు కేవలం సాగర్పైనే ఆధారపడాల్సి ఉంటుందని, అక్కడ […]
ప్రకాశం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు ఆయకట్టు పరిధిలో ఈ సంవత్సరం సిరుల పంట పండింది. దీనితో రైతులు, రైతు కూలీలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ మొదట్లో ఆయకట్టుకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రానప్పటికీ, నీటి లభ్యతపై కొంచెం అనుమానం ఉన్న పరిస్థితుల్లోనే రైతాంగం పెద్ద ఎత్తున వారి నాట్లను ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం మంచి వర్షాలతో […]