iDreamPost
android-app
ios-app

రెండేళ్ల తర్వాత నాగార్జుసాగర్ వద్ద అద్భుత దృశ్యం.. వీడియో వైరల్

  • Published Aug 06, 2024 | 10:43 AM Updated Updated Aug 06, 2024 | 10:43 AM

Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ నిండు కుండలా తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జలకల సంతరించుకుంది. ప్రస్తుతం ఇక్కడ అందమైన దృశ్యాలు చూడటానికి సందర్భకులు క్యూ కడుతున్నారు.

Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ నిండు కుండలా తలపిస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జలకల సంతరించుకుంది. ప్రస్తుతం ఇక్కడ అందమైన దృశ్యాలు చూడటానికి సందర్భకులు క్యూ కడుతున్నారు.

  • Published Aug 06, 2024 | 10:43 AMUpdated Aug 06, 2024 | 10:43 AM
రెండేళ్ల తర్వాత నాగార్జుసాగర్ వద్ద అద్భుత దృశ్యం.. వీడియో వైరల్

గత నెల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలతో పలు జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ కు జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి భారీ వరద నీరు చేరుకోవడంతో పది గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని దిగువనున్న సాగర్ కు వదులుతున్నారు. దీంతో కేవలం వారం రోజుల్లోనే నాగార్జునసాగర్ జలాశయంలోకి భారీగా వరద నీరు పోటెత్తుతుంది.నీరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు 60 వేల క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశ వ్యాప్తంగా రుతుపవనాలు జోరుగా విస్తరించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిన అనేక చోట్ల కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో దిగువకు గేట్లు ఓపెన్ చేశారు.దీంతో నాగార్జున సాగర్ కు భారీగా నీరు వచ్చి చేరింది.ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు నిండు కుండలా మారాయి. ఈ క్రమంలోనే అదికారులు దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఇప్పటి వరకు ఆరు గేటర్లను ఓపెన్ చేశారు. రెండేళ్ల తర్వాత నాగార్జన సాగర్ గేట్లు ఎత్తడంతో సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2022 లో ఆగస్టు 11న చివరిసారిగా నాగార్జున సాగర్ గేట్లు ఎత్తారు.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఆరు గెట్లు ఎత్తివేడయంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద అందాలు మహా అద్భుతంగా కనువిందు చేస్తున్నాయి.

అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూడు సార్లు సైరన్ మోగించి, డ్యామ్ కు సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేశారు.మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నీటి నిలువ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 582 అడుగులకు చేరినట్లు తెలుస్తుంది. రెండేళ్ల తర్వాత గేట్లు ఎత్తివేయడంతో నాగార్జున సాగర్ కి సందర్శకులు క్యూ కడుతున్నారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వెళ్తున్నారు. అక్కడ అందమైన అద్భుత దృశ్యాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.