iDreamPost
android-app
ios-app

నాగార్జున సాగర్‌ వెళ్లాలనుకుంటున్నారా.. మీకోసం TGSRTC బంపరాఫర్‌

  • Published Aug 06, 2024 | 1:26 PM Updated Updated Aug 06, 2024 | 1:26 PM

Nagarjuna Sagar: గత నెల రోజులగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలకు జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున‌సాగర్ గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

Nagarjuna Sagar: గత నెల రోజులగా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు దంచికొడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలకు జలాశయాలు, కాల్వలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున‌సాగర్ గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

నాగార్జున సాగర్‌ వెళ్లాలనుకుంటున్నారా.. మీకోసం TGSRTC బంపరాఫర్‌

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కొనసాగడంతో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ వచ్చాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, కేరళా, తెలుగు రాష్ట్రల్లో వర్షాలు దంచికొట్టాయి. మహరాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం డ్యాం నుంచి నాగార్జున‌సాగర్‌కి భారీగా నీరు వచ్చి చేరడంతో నీటి మట్టం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మొత్తం 20 గేట్లను 5 ఫీట్ల వరకు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత సాగర్ గేట్లు తెర్చుకోవడంతో సందర్శకులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు వెళ్తున్నారు. తాజాగా సాగర్ కి వెళ్లే సందర్శకులకు TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

ఎగువ ప్రాంతాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. దీంతో పలు జలాశయాలు వరద నీటితో కళకళలాడుతున్నాయి. కాల్వలు, చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్న వరదనీటితో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో 20 గేట్లు ఎత్తివేశారు అధికారులు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో వివిధ జిల్లాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి సందర్శకులు ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి పర్యాటకులు సాగర్ బారులు తీరారు.

సాగర్ అందాలు సందర్శించాలనకునే వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఎంజీఎంఎస్ బస్‌స్టాండ్ నుంచి డైరెక్ట్ గా సాగర్ కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ మేరకు రీజియన్ మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. నల్లగొండ డిపో ఆధ్వర్యంలో ఈ సర్వీసులు నడుస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజ ఉదయం 5 గంటల నుంచి మొదలై.. 6.45, 7.15, 7.30., 8.00, 9.45, 10.45 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు సాయంత్రం 5.40 గంటలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజియన్ మేనేజర్ శ్రీలత తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ సేవలు సురక్షితం, సుఖవంతం అంటున్నారు ఆర్టీసీ అధికారులు.