iDreamPost
android-app
ios-app

నాగార్జున సాగర్ జలకళ.. 2 ఏళ్ల తర్వాత 26 గేట్లు ఎత్తివేత! పర్యాటకుల సందడి!

  • Published Aug 09, 2024 | 9:11 AM Updated Updated Aug 09, 2024 | 9:11 AM

Nagarjuna Sagar: ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ నిండు కుండలా తలపిస్తుంది. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు సాగర్ కి చేరుకోవడంతో జలకల సంతరించుకుంది.

Nagarjuna Sagar: ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ నిండు కుండలా తలపిస్తుంది. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద నీరు సాగర్ కి చేరుకోవడంతో జలకల సంతరించుకుంది.

నాగార్జున సాగర్ జలకళ.. 2 ఏళ్ల తర్వాత 26 గేట్లు ఎత్తివేత! పర్యాటకుల సందడి!

గత నెల రోజుల నుంచి దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు జలాశయాలు, కెనాల్స్, చెరువులు పొంగిపొర్లుగున్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్ట్ కు జూరాల, సుంకెశాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తివేశారు. ఆ నీరు ప్రస్తుతం నాగార్జునసాగర్ కి వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జునసాగర్ జలాశయంలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు 26 గేట్లు ఎత్తి వేసి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సుందర దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి.. వాటిలో నాగార్జున సాగర్ ఒకటి. ప్రకృతి రమణీయమైన సాగర తీరంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో శ్రీశైలం జలాశయం నుంచి భారీ వరద నీరు నాగార్జునసాగర్ కి వచ్చి చేరడంతో కలవడంతో గేట్లు ఎత్తివేస్తుంటారు. ఆ సమయంలో డ్యామ్ అందాలు చూసి మురిసిపోతుంటారు పర్యాటకులు. గురువారం శ్రీశైటం జలాశయం నుంచి 3,52,158 క్యుసెక్కుల వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ డ్యామ్ 26 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.వాస్తవానికి బుధవారం ఉదయానికి ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో 18 గేట్ల ద్వారా కొనసాగించిన నీట విడుదల మళ్లీ వరద ప్రవాహం పెరిగిపోవడంతో మిగతా గేట్లను ఎత్తివేశారు.డ్యామ్ నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 585.90 అడుగుల వద్ద నిల్వ ఉంది.

దాదాపు రెండేళ్ల తర్వాత కృష్ణమ్మ నది బిరా బిరామంటు పరిగెడుతూ కలకలలాడుతుంది.  ఆ అందాలను చేసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 2022లో ఆగస్టు 11న చివరిసారిగా నాగార్జున సాగర్ గెట్లు ఎత్తారు.. మళ్లీ 2 ఏళ్ల తర్వాత 26 గేట్లు ఎత్తడంతో నాగార్జునసాగర్ వద్ద అందాలు అద్భుతంగా కనువిందు చేస్తున్నాయి. నాగార్జున సాగర్ హిల్ కాలనీ లాంచ్ స్టేషన్, డ్యామ్, జల విద్యుత్ కేంద్రం, కొత్త వంతెన, పాత వంతెన మొత్తం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే ముందు పూజలు నిర్వహిస్తుంటారు. 3 సార్లు సైరన్ మోగిస్తారు, డ్యామ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తారు.