కర్నూలు జిల్లాలో ఒకప్పుడు గట్టి పట్టు కలిగిన తెలుగుదేశానికి ఆదోని నియోజకవర్గంలో మాత్రం మిశ్రమ ఫలితాలు లభించాయి. పార్టీ ఆవిర్భవించిన 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో నాలుగుసార్లే అక్కడ విజయం సాధించగలిగింది. అందులోనూ మూడుసార్లు మీనాక్షి నాయుడే ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికలతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయి పతనావస్థకు చేరిన టీడీపీని అంతర్గత పోరు మరింత కుంగదీస్తోంది. పార్టీ ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిపై ఆయన మాజీ […]
కొంతకాలంగా మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఇది ఆయన వ్యవహారశైలికి పూర్తిగా విరుద్ధం. అందుకే జేసీ దివాకర్ రెడ్డి వైపు అందరూ చూస్తున్నారు. ఎప్పుడూ తన భావాలను నిర్మొహమాటంగా చెబుతూ మీడియాలో హల్చల్ చేసే జేసీ దివాకర్ రెడ్డి.. ఎందుకు సైలెంట్ అయ్యారనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానికంగా కొంత హడావుడి చేస్తున్నా.. జేసీ బ్రదర్స్ తీరు తమ్ముళ్లలో టెన్షన్ను రేకెత్తిస్తోంది. టీడీపీ […]
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు వలంటీర్లు. నిజంగా వలంటీర్ అన్న పదానికి న్యాయంచేస్తూ ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. కరోనా అంటే భయంకరమైన వైరస్ గా ప్రచారం జరిగిన రోజుల్లో కూడా వలంటీర్లు ప్రజల మధ్యనే నిలిచారు. ప్రాణాలకు తెగించి వారి అవసరాలను తీర్చారు. మహమ్మారి బారిన పడినవారి బాగోగులను కూడా చూసుకున్నారు. వారికి తక్షణం ప్రభుత్వ సేవలు అందేలా చేయడంలో ముందు వరుసలో నిలిచారు. కరోనా పరీక్షలు చేయడంలో ఏపీ దేశంలోనే […]
తన పాలనలో మంచి జరిగితే తనను ఆశీర్వదించాలని, లేదంటే ద్వేషించండని, అంతేకానీ మారీచుల రూపంలో ఉన్న చంద్రబాబు ముఠా మాటలను, ప్రచారాలను నమ్మవద్దని సీఎం వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఏం మంచి జరిగింది..? ఇప్పుడు ఏం మంచి జరిగింది అనేది బేరీజు వేసుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసారావుపేటలో జరిగిన వాలంటర్లను సన్మానించే కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్ .. చంద్రబాబు,టీడీపీ అనుకూల పార్టీల నేతలు,ఎల్లోమీడియా పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. […]
ఆంధ్రప్రదేశ్ లో అధికారం దక్కదనే దుగ్ధతో రాష్ట్రాన్ని అన్ని రకాలుగానూ బద్నాం చేసే పనిలో బాబు బ్యాచ్ ఉంది. కానీ ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని పచ్చమీడియా సహా అందరూ గగ్గోలు పెడుతుంటారు. కానీ ఏపీలో ఆదాయం పెరుగుతున్నట్టుగా రిజిస్ట్రేషన్ల రాబడి సహా జీఎస్టీ వసూళ్ల వరకూ అనేక అంశాలు రుజువు చేస్తాయి. లెక్కలతో మాకు పనిలేదంటూ, కాకి లెక్కలతోనే ఆ సెక్షన్ గోలపెడుతున్న తీరు విడ్డూరంగా ఉంటుంది. ఆ క్రమంలోనే […]
కాదేదీ కవితకు అనర్హం అన్నారు ఓ మహాకవి. విషయం ఏదైనా రాజకీయానికి కాదు అనర్హం అని నిరూపిస్తున్నారు దేశంలోని రాజకీయ పార్టీల నేతలు. రాజకీయ ప్రత్యర్థులపై, ప్రభుత్వాలపై విమర్శలు చేసేందుకు కొంతమంది పొరుగుదేశాల పరిస్థితిని కూడా వినియోగించుకుంటున్నారు. ఆయా దేశాలతో స్థానిక ప్రభుత్వాలను పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటక రంగం దెబ్బతినడంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్షీణించింది.ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకులు లభించని పరిస్థితి […]
పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు పలు నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుల నడ్డి విరుస్తోంది. దీనికి ఏ ఒక్క రాష్ట్రమో కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి. వాటి నుంచి కొంచెం ఉపశమనం కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటీవల చేపట్టిన చర్యల ఫలితంగా కొన్నింటి ధరలు అదుపులోకి వచ్చాయి. ప్రధానంగా నూనె ధరలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ధరలను అదుపులోకి తెచ్చింది. అలాగే.. పేదల గృహ నిర్మాణాలకు సిమెంట్, […]
చంద్రబాబు ఐదేళ్ల పదవీ కాలంలో విద్యుత్ సంస్థల అప్పులు భారీగా పెరిగిపోయాయని, వేలకోట్ల రూపాయల బకాయిలు, ట్రూఅప్ ఛార్జీలు పెండింగ్లో పెట్టి వెళ్లారని, ఫలితంగా స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రభుత్వంపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో […]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తాజాగా హైదరాబాద్లో ఎదురైన పరిస్థితిని చూసి తమ్ముళ్లు బావురమంటున్నారు. తెలంగాణ రాజకీయ అంశాల్లో వేలుపెట్టే అవకాశం పోయినా.. కనీసం పార్టీ కార్యక్రమాలు కార్యాలయం వెలుపల నిర్వహించుకునే అవకాశం చంద్రబాబుకు లేని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్ భవన్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. 40 కేజీల కేక్ను కట్ చేసి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత […]
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలను అలవోకగా చెప్పేస్తున్నారు. ఆయన చెప్పే అబద్దాల జాబితా రాయాలంటే అదో పెద్ద గ్రంధమే అవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు. లెక్కలేనన్ని అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకున్నారు. అదేమంటే ప్రజల జ్ఞాపకశక్తి స్వల్పం అని ఆయన దృఢనమ్మకం. ఆ మాటే తరచూ చెపుతూఉంటారు. ఒక మాటను ప్రజల మెదళ్ళలో నాటుకుపోయేలా చెప్పాలంటే ఒకే మాట రోజూ చెప్తూనే ఉంటారు. అబద్దాలు చెప్పడం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీకాదు కానీ నిన్న హైదరాబాద్ లో చెప్పిన అబద్దం ఇప్పటివరకూ ఆయన చెప్పిన […]