iDreamPost
android-app
ios-app

చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్‌.. దమ్ముంటే ఆ పని చేయమంటూ

  • Published Jan 29, 2024 | 9:57 AM Updated Updated Jan 29, 2024 | 1:34 PM

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబుకు ఓపెన్‌ చాలెంజ్‌ చేశారు. దమ్ముంటే ఆ పని చేయమంటూ సవాల్‌ చేశారు. ఆ వివరాలు..

Kesineni Nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని.. చంద్రబాబుకు ఓపెన్‌ చాలెంజ్‌ చేశారు. దమ్ముంటే ఆ పని చేయమంటూ సవాల్‌ చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 29, 2024 | 9:57 AMUpdated Jan 29, 2024 | 1:34 PM
చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని సవాల్‌.. దమ్ముంటే ఆ పని చేయమంటూ

మరి కొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్ల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమరశంఖరావం పూరించారు. ఈ ఎన్నికల్లో తాను అభిమన్యుడిని కాదని.. అర్జునుడిని అని… ప్రజలే తన పాలిట కృష్ణుడంటూ.. రానున్న ఎన్నికల సమరాన్ని కురుక్షేత్రంతో పోల్చారు. ఇక సీఎం జగన్‌ ఎన్నికల కోసం పార్టీని, కేడర్‌ని రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉండగా.. కూటమిగా ఏర్పడ్డ టీడీపీ-జనసేన పార్టీల్లో ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మొదలు కాలేదు.

అసలు ఈ రెండు పార్టీల మధ్య ముఖ్యమైన సీట్ల పంపిణీ వ్యవహారమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు కీలక నేతలంతా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. దీనిలో భాంగంగానే కొన్ని రోజుల క్రితం విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చంద్రబాబుకు ఓపెన్‌ సవాలు విసిరారు. ఆ వివరాలు..

Keshineni Nani challenge to Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబుకు.. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఓపెన్‌ ఛాలెంజ్‌ విసిరారు. చంద్రబాబుకు తన మీద గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు. అలానే నారా లోకేష్‌ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. కేశినేని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘‘విజయవాడలో అంబేద్కర్ ఉన్నారు, నేను ఉన్నాను. నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు కొందరు. కానీ నేను మూడు లక్షల ఓట్లతో గెలుస్తున్నాను. ఇది కన్ఫామ్‌. కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. జనవరి మూడో తేదీననే చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది’’ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.

అంతేకాక నాని మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అన్నారు. దానికి మూల కారణం తిరువూరు సంఘటనే అని గుర్తు చేశారు. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా, అవమానాలు పడ్డాను అంటూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని తనలాంటి వ్యక్తులు ఆయన పార్టీలో ఉండాలని ఆహ్వానించారని తెలిపారు. చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనే అజెండాతో పని చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. అంతేకాక రాజధాని పేరుతో చంద్రబాబు 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడని.. అందుకే సొంతిల్లు కూడా కట్టలేదన్నాడు. త్వరలోనే మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి చంద్రబాబు రెడీగా ఉన్నాడంటూ కేశినేని నాని ఎద్దేవా చేశారు.

నాని మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్‌ నిజమైన అంబేద్కర్‌వాది. కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా పనిగట్టుకుని మరీ ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు. సీఎం జగన్‌ను మొదటగా స్వామిదాస్ అడిగింది ఒక్కటే.. వినగడప కట్టలేరు బ్రిడ్జి. రూ.26కోట్ల వ్యయంతో ఫిబ్రవరి మూడో తేదీన కట్టలేరు బ్రిడ్జికు శంఖుస్థాపన చేయబోతున్నాం. స్వామిదాస్ పక్కా లోకల్.. మనకు అన్నీ చేసిపెట్టే వ్యక్తి సీఎం జగన్’’ అన్నారు.