iDreamPost
android-app
ios-app

YCP వెన్నుపోటు నేతలకు TDPలో భంగపాటు..!

  • Published Jan 11, 2024 | 10:59 AM Updated Updated Jan 11, 2024 | 10:59 AM

ఆదరించి.. అక్కున చేర్చుకున్న పార్టీని వీడి.. టీడీపీలో చేరారు సీనియర్ నేతలు ఆనం, కోటంరెడ్డి. చంద్రబాబుని నమ్మి టీడీపీలోకి వెళ్లిన వాళ్లకి భారీ షాక్ తగిలింది అంట. ఆ వివరాలు..

ఆదరించి.. అక్కున చేర్చుకున్న పార్టీని వీడి.. టీడీపీలో చేరారు సీనియర్ నేతలు ఆనం, కోటంరెడ్డి. చంద్రబాబుని నమ్మి టీడీపీలోకి వెళ్లిన వాళ్లకి భారీ షాక్ తగిలింది అంట. ఆ వివరాలు..

  • Published Jan 11, 2024 | 10:59 AMUpdated Jan 11, 2024 | 10:59 AM
YCP వెన్నుపోటు నేతలకు TDPలో భంగపాటు..!

వెన్నుపోటు, అవసరానికి తగ్గట్టు వాడుకుని.. ఆ తర్వాత వారిని పక్కకు పడేయడంలో చంద్రబాబుని మించిన వారు మరొకరు ఉండరని వైసీపీ శ్రేణులు నిరంతరం ప్రచారం చేస్తుంటాయి. వాస్తవంగా కూడా చంద్రబాబు వ్యక్తిత్వం అదే అంటారు ఆయనను దగ్గర నుంచి గమనించిన వారు, రాజకీయ పండితులు. అవసరానికి తగ్గట్టుగా మాటలు మార్చడంలో చంద్రబాబు దిట్ట అనే భావన జనాల్లో పాతుకుపోయింది. మరీ ముఖ్యంగా ఎన్నికల వేళ ఆయన తీరు చూస్తే.. ఈవిషయం అర్థం అవుతుంది అంటారు.

అలాంటి చంద్రబాబును నమ్మి.. ఆశ్రయం ఇచ్చి.. గుర్తింపు ఇచ్చిన కన్న తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి.. టీడీపీలో చేరారు కొందరు వైసీపీ నేతలు. చంద్రబాబు తత్వం తెలిసి కూడా ఆయన పంచన చేరి.. ఇప్పుడు బొక్క బోర్లా పడ్డామని భావిస్తున్నారట సదరు వైసీపీ బహిష్కృత నేతలు. ప్రస్తుతం వారు రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన ఉన్నారంటూ అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు టీడీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని.. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు చెప్పిన మాటలు, ఇచ్చిన గౌరవం ఇప్పుడు విన్పించడం, కనిపించడం లేదని.. దీంతో ఆ ముగ్గురి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అనే ప్రచారం ఊపందుకుంది.

మరోసారి మోసపోయిన ఆనం..

సీనియర్‌ నేత ఆనం రామనారాయణరెడ్డి.. మరోసారి చంద్రబాబు చేతిలో మోసపోయాడని ఆయన అభిమానులే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం.. టీడీపీలోకి వచ్చాక.. చంద్రబాబు చేతిలో పావుగా మారారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆయనకు 2016లో ఎమ్మెల్సీ లేదా మంత్రి పదవి ఆశ చూపడంతో టీడీపీలో చేరారు. ఆనం సైకెలక్కిన మరు క్షణమే మాట మార్చారు చంద్రబాబు. ఎమ్మెల్సీ కాదు కదా.. కనీసం ఆత్మకూరు పార్టీ ఇన్‌ఛార్జ్‌ పదవి కూడా ఇవ్వకుండా అవమానించారు. చంద్రబాబు చేసిన అవమానాల్ని తట్టుకోలేక కుమిలిపోతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ ఆయనను అక్కున చేర్చుకుంది. వెంకటగిరి నుంచి బరిలోకి దింపి గెలిపించుకుంది.

మరి ఆనం ఏం చేశారు.. ఆదరించి అక్కున చేర్చుకున్న వైసీపీ పార్టీకే వెన్నుపోటు పొడిచి.. మరోసారి చంద్రబాబు పంచన చేరారు. దాంతో వైసీపీ ఆయనను బహిష్కరించింది. దాంతో టీడీపీ కండువా కప్పుకోకుండానే లోకేశ్‌ యువగళం పాదయాత్రలో హల్‌చల్‌ చేశారు. జిల్లా పార్టీ సారథ్య బాధ్యతలతో పాటు నెల్లూరు సిటీ, ఆత్మకూరు సీట్లు ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇవ్వడంతో ఆనం యువగళంలో పాల్గొన్నారు. తీరా ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బాబు మరోసారి మాట మార్చి.. ఆనం ఒక్క ఆత్మకూరుకే పరిమితం కావాలని ఆదేశించారట.

అయితే ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. ఆవిషయం టీడీపీకి కూడా తెలుసు. అక్కడ పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకున్న ఆనం తనకు నెల్లూరు సిటీ లేదా వెంకటగిరి స్థానాన్ని కేటాయించాలని చంద్రబాబుని విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయిందని సమాచారం. అంతేకాక ఆత్మకూరు లేదా సర్వేపల్లిలో పోటీ చేయాలని తెగేసి చెప్పడంతో ఆనం దిక్కతోచని పరిస్థితిలో ఉన్నారంట. చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయానంటూ ఆనం ఆంతరంగికుల వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

కోటంరెడ్డి సీటు వెనుక కుట్ర..

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందట. రూరల్‌ టీడీపీ టికెట్‌ నీదేనంటూ మాట ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ సీటు జనసేనకు ఇచ్చేందుకు తెరవెనుక రాజకీయం చేస్తున్నారంటూ జోరుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం నెల్లూరు జనసేనలో కీలకంగా ఉన్న ఓ నేత.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రూరల్‌ టికెట్‌ రాకుండా తెరవెనుక కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.

చంద్రశేఖర్‌రెడ్డికి బాబు ఝలక్‌

అలానే వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఉదయగిరి టికెట్‌ నీదే అంటూ నాడు చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి టీడీపీ కండువా కప్పుకున్న చంద్రశేఖర్‌రెడ్డికి.. తాజాగా టీడీపీ అధినేత ఝలక్‌ ఇచ్చారని సమాచారం. అసెంబ్లీ టికెట్‌ కాదు కదా ఎమ్మెల్సీ కూడా ఇచ్చేది లేదని.. ముందుగా పార్టీ కోసం పని చేయాలని ఆదేశాలు జారీ చేశారట. అంతేకాక ఉదయగిరిలో టీడీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డికి కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని.. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదని తెలుస్తుంది.

బాబు వైఖరితో ఈ ముగ్గురు నేతల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అనే టాక్‌ వినిపిస్తోంది. వైసీపీలో ఉంటే రానున్న ఎన్నికల్లో సీటుతో పాటు.. గౌరవ మర్యాదలు దక్కేవని.. ఇప్పుడు టీడీపీలో తమను పట్టించుకునే నాథుడే లేడని ఈ నేతలు వాపోతున్నారట. భవిష్యత్తు కార్యచరణ ఏంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట.