Dharani
కుప్పంలో జగన్ వ్యూహాలు చూస్తే.. బాబు ఓటమి పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు జగన్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఆ వివరాలు..
కుప్పంలో జగన్ వ్యూహాలు చూస్తే.. బాబు ఓటమి పక్కా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కుప్పం కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు జగన్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఆ వివరాలు..
Dharani
మరి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రానున్న ఎలక్షన్స్ కోసం అధికార, విపక్ష పార్టీలు రెడీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల కదనరంగంలో రెండడుగులు ముందే ఉన్నారు. 175కు 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. జగన్ ప్రణాళికలు చూసి విపక్షాలకు పిచ్చెక్కిపోతుంది. ఇక 175 స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న జగన్.. కుప్పం కుంభస్థలాన్ని కొట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఆయన వ్యూహాలు చూస్తే.. ఇక కుప్పంలో బాబు ఓటమి పక్కా అనిపిస్తోంది. అంతేకాక రానున్న ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ తరఫున భరత్ పోటీ చేయబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఇక కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఇక జగన్ వ్యాఖ్యలు చూస్తే.. కుప్పంలో బాబు ఓటమి పక్కా అని అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ పండితులు.
చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. పైగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశాడు. కానీ ఏనాడు ఆయన కుప్పం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. అంతేకాక కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చడమే కాక.. నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చారు జగన్.
ఇక అన్నింటికంటే ముఖ్యమైనది.. సీఎం జగన్ కుప్పానికి కృష్ణా జలాలు తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారు. 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా.. కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చారు. రెండేళ్ల క్రితం అనగా 2022, సెప్టెంబర్ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభలో కృష్ణాజలాలు తీసుకువస్తానని మాటిచ్చిన జగన్.. రెండేళ్లు కూడా గడవకముందే దాన్ని నిలబెట్టుకున్నారు.
అంతేకాక కుప్పంలో చంద్రబాబు పాలనలో అందించిన ఇళ్ల పట్టాలు సున్నా. కానీ జగన్ సర్కార్ ఇప్పటికే 15 వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వగా.. మరో 15 వేల మందికి పైగా త్వరలోనే పట్టాలను మంజూరు చేయనున్నారు. అంతేకాక కుప్పంలో 7,898 ఇళ్లను మంజూరు చేసిన వైసీపీ ప్రభుత్వం.. వాటిల్లో ఇప్పటికే 4,871 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. అలానే కుప్పంలో 90 శాతం ప్రజలకు నవరత్నాల ద్వారా చేపట్టిన సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేశారు.
ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు.. అక్కడ చేసిన అభివృద్ధి శూన్యం. కానీ అధికారంలోకి వచ్చిన 56 నెలల్లోనే కుప్పం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఇక తాజాగా కృష్ణా జలాలు తీసుకువచ్చి.. ఈ ప్రాంత ప్రజల 40 ఏళ్ల కలను సాకారం చేసిన భగీరథుడిగా ప్రశంసలు పొందుతున్నారు జగన్. వైసీపీ పాలనలో కుప్పాన్ని అభివృద్ధికి కెరాఫ్ అడ్రెస్‌గా మార్చిన జగన్.. ఇక్కడ నుంచి భరత్‌ను బరిలో దించుతున్నారు. అతడిని గెలిపిస్తే.. మంత్రి పదవి కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. దాంతో రానున్న రోజుల్లో కుప్పం మరింత అభివృద్ధి చెందనుందని ఈ నియోజకవర్గ ప్రజలు భావిస్తోన్నారు.
ఇక జగన్ చేస్తోన్న అభివృద్ధిని చూసిన చంద్రబాబు.. కుప్పంలో తన ఓటమి ఖాయమని డిసైడ్ అయిపోయాడు. అందుకే కొన్ని రోజుల క్రితం ఈసారి తాను కుప్పం బరి నుంచి తప్పుకుని.. భార్యను నిలబెట్టబోతున్నట్లు ఇండైరెక్ట్‌గా భువనేశ్వరి చేత చెప్పించాడు. ఇక జగన్ చర్యలు చూస్తే.. కుప్పంలో బాబును ఓడించేందుకు అన్ని విధాలుగా రెడీ అవుతున్నారని అనిపిస్తోంది. అంతేకాక రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి పక్కా అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.