Dharani
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. చంద్రబాబు తీరు చూస్తే భయమేస్తుంది అంటున్నారట జనసేన నేతలు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు.. పవన్‌కి వెన్నపోటు పొడుస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు ఏంటి అంటే..
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది.. చంద్రబాబు తీరు చూస్తే భయమేస్తుంది అంటున్నారట జనసేన నేతలు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు.. పవన్‌కి వెన్నపోటు పొడుస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలు ఏంటి అంటే..
Dharani
ఈ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీ కూటమిగా పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. పొత్తు గురించి పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా అధికారిక ప్రకటన చేశాడు. ఈ మూడు నెలలు టీడీపీ-జనసేన నేతలు, కార్యకర్తలు ఇరు పార్టీల జెండాలు మోయాల్సిందే అని తాజాగా చంద్రబాబు, పవన్ కేడర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు టీడీపీ, జనసేన కూటమి కలిసి.. వైసీపీని ఓడించాలని ప్రయత్నాలు చేస్తుంటే.. జగన్ మాత్రం సింగిల్‌గానే బరిలో దిగి.. క్లీన్ స్వీప్ చేయాలని బలంగా నిర్ణయించుకున్నారు. ఇందుకు తగ్గటుగా ఇప్పటికే కార్యచరణ కూడా ప్రారంభించారు. అభ్యర్థుల మార్పు, కూర్పు మొదలు పెట్టారు. సంక్రాంతి నాటికి జగన్ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటిస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
అటు టీడీపీ, జనసేన పార్టీల్లో చూసుకుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఓవైపు జగన్ ప్రతి నియోజకవర్గంలో వైసీపీనే విజయం సాధించాలి అనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తే.. కూటమి మాత్రం ఆ దిశగా ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. అయితే గత కొన్నాళ్లుగా కూటమి నేతలు.. సంక్రాంతి నాటికి మొదటి జాబితా వస్తుందని భావిస్తుండగా.. తాజాగా ఎల్లో మీడియా సంక్రాంతి నాటికి కేవలం 25 మందితో మొదటి జాబితా వెలువడుతుందంటూ చావు కబురు చల్లగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
దీనిపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు అధికార పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంటే.. ఇటు కూటమి మాత్రం నాన్చుడు ధోరణి ప్రదర్శించడం ఏంటో అర్థం కావడం లేదు అంటున్నారు. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది అంటున్న తరుణంలో.. మరి సంక్రాంతికి 25 మందితోనే తొలి జాబితా విడుదల చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటి.. మిగతా అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు.. ఇప్పటి వరకు సీట్ల పంపిణి గురించే ప్రకటన రాలేదు.. ఇక అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించాలి.. ప్రచారం ఎప్పుడు చేసుకోవాలి.. అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.
అంతేకాక చంద్రబాబు నాయుడు కావాలనే అభ్యర్థుల జాబితాను ఆలస్యం చేస్తున్నాడని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ కేవలం తాను గెలవడం కోసం మాత్రమే జనసేనతో పొత్తు పెట్టుకుందనేది జగమెరిగిన రహస్యం. ఈ విషయం పవన్ కళ్యాణ్‌కు, జనసేన నేతలకు కూడా తెలుసు. అందుకే వారు చంద్రబాబు ధోరణిపై అసహనం, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాబు పవన్ కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడిచే ఆలోచనలో ఉన్నాడని.. అందుకే నామినేషన్ల సమయం వరకు కూడా జనసేనకు ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఇస్తారో తేల్చకుండా.. కావాలనే ఆలస్యం చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు జనసేన నేతలు.
బాబు తన మాయ మాటలతో మభ్యపెడుతున్నారని.. కానీ చివరకు సీట్ల పంపిణీకి వచ్చే సరికి జనసేనకు మొండి చేయి చూపుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమ అధ్యక్షుడు పవన్ దీనిపై స్పందించకపోవడం.. వారిని మరింత భయపెడుతుంది. మరి జనసేన నేతలు అన్నట్లుగానే ఈ ఎన్నికల్లో చంద్రబాబు పవన్‌కి వెన్నపోటు పొడుస్తారా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.