అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 777 ఛార్లీ కేవలం పది రోజులకే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల గ్రాస్ దాటించేసి ఔరా అనిపించుకుంటోంది. తెలుగులో మరీ అద్భుతాలు చేయలేకపోయినా విక్రమ్ పోటీని తట్టుకుని ఉన్న తక్కువ స్క్రీన్లలోనూ డీసెంట్ బిజినెస్ తో పాటు లాభాలు వెనక్కు ఇచ్చింది. సురేష్ సంస్థ అండదండలు విరాట పర్వం కన్నా ఎక్కువగా ఈ ఛార్లీకే ఉపయోగపడ్డాయి. కర్ణాటకలో యాక్షన్ జోనర్ ను మినహాయిస్తే మిగిలిన క్యాటగిరీల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం విశేషం. […]
సినిమా తీయడం, హిట్టు కొట్టడం, కోట్ల రూపాయల వసూళ్లు చేసుకోవడం ఎంత కీలకమో దాన్ని పైరసీ బారిన పడకుండా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కానీ దశాబ్దాల తరబడి ప్రభుత్వాలు కానీ పరిశ్రమ వర్గాలు కానీ దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోలేకపోయాయి. వచ్చే మార్గం మారిందే తప్ప ప్రతి కొత్త మూవీ విడుదల కావడం ఆలస్యం సాయంత్రానికి దాని కెమెరా ప్రింట్ ఆన్ లైన్ లో ప్రత్యక్షమవుతోంది. సరే ఇది ఎవరూ కట్టడి చెయ్యలేని వ్యవహారం సినిమా […]
దేశవ్యాప్తంగా సంచలనాత్మక వసూళ్లతో అదరగొడుతున్న కెజిఎఫ్ 2 ఓటిటి ప్రీమియర్ డేట్ ఆల్మోస్ట్ లాక్ అయ్యిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మే 13న KGF Chapter 2, Amazon Prime Videoలో రావొచ్చనే లీక్ గట్టిగానే తిరుగుతోంది. ఇదెంత వరకు నిజమో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని అంశాలు గమనించవవచ్చు. ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన డిజిటల్ డేట్ వచ్చే సమయానికి కెజిఎఫ్ 2 […]
ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కెజిఎఫ్ 2 మేనియా మాములుగా లేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టికెట్లు దొరక్క మాస్ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు. మన దగ్గరంటే సరేలే అనుకోవచ్చు కానీ ముంబై ఢిల్లీ లాంటి మెట్రో ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బీహార్, యుపి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల మాస్ సెంటర్స్ లో అరాచకం మాములుగా లేదు. ఇదంతా ఓకే కానీ కెజిఎఫ్ రాఖీ భాయ్ కి […]
ఊహించిన దానికన్నా ఎక్కువగా కెజిఎఫ్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. బాలీవుడ్ సైతం నివ్వెరబోయేలా ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో ఆడటం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కెజిఎఫ్ పార్ట్ 1 హిందీ వెర్షన్ ఫుల్ రన్ ఫిగర్స్ ఇప్పుడీ రెండో పార్ట్ కేవలం ఒకే రోజులో దాటేయడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. చాలా తక్కువ గ్యాప్ లో పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇప్పుడీ కెజిఎఫ్ 2 అక్కడి […]
ఇంకో రెండు రోజుల్లో రాఖీ భాయ్ గా రాబోతున్నాడు యష్. బ్లాక్ బస్టర్ కెజిఎఫ్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ చాప్టర్ 2 కోసం యూనిట్ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తోంది. మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ కాదు కానీ ఉన్నంతలో హీరో దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో యష్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ మీడియా అడిగిన ప్రశ్నలకు మన బాషలోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడం […]
Shahid Kapoor’s ‘Jersey’ gets postponedనిన్నటి దాకా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న హిందీ జెర్సీ ఫైనల్ గా వెనుకడుగు వేసింది. దీనికి ప్రధాన కారణం కెజిఎఫ్ 2 ప్రభంజనమే. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జెర్సీ చాలా వెనుకబడి ఉండటంతో పాటు వాయిదా వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి అధికంగా రావడంతో ఇంకో మార్గం లేకపోయింది. దానికి తోడు తమిళనాడు, కేరళలో విజయ్ బీస్ట్ ప్రభావం గట్టిగా కొడుతోంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ తినాల్సి వస్తుందనే […]
Salaar Teaser to be Out on April 14 ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ డిజాస్టర్ దెబ్బకు నీరసపడిపోయిన డార్లింగ్ అభిమానుల కోసం సలార్ టీజర్ రెడీ అవుతోందట. 14న రిలీజవుతున్న కెజిఎఫ్ 2 తో పాటు దీన్ని ప్రదర్శించబోతున్నట్టు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఎంత సేపు ఉంటుందనేది తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయే రేంజ్ లో ఎలివేషన్లు పెట్టినట్టు తెలిసింది. కెజిఎఫ్ 2 మీద తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు […]
ఆర్ఆర్ఆర్ హడావిడి జరుగుతోంది కాబట్టి కెజిఎఫ్ 2 టీమ్ ఇంకా పూర్తి స్థాయి ప్రమోషన్లు మొదలుపెట్టలేదు. రాజమౌళి సినిమా చల్లబడ్డాక తమ అస్త్రాలను బయటికి తీయబోతున్నారు. ఇప్పటికి సైలెంట్ గా అనిపిస్తోంది కానీ ఏప్రిల్ 14 లోపు హైప్ అమాంతం ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్టార్ హీరోల రేంజ్ లో దీనికీ తెల్లవారుఝామున ప్రీమియర్లు వేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కర్ణాటకలో కాదు ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లో కూడా షోలు వేస్తారట. రాఖీ భాయ్ అంచనాలు అలా ఉన్నాయి మరి. […]
ఏప్రిల్ 14న విడుదల కాబోతున్న కెజిఎఫ్ 2 మీద విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధానికి తెరతీశారు. ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ రిలీజవుతున్న నేపథ్యంలో తమదే ఆధిపత్యం ఉండాలన్న ధోరణి చూపిస్తుండటం పరస్పరం ఆన్ లైన్ గొడవలకు తెరతీసేలా కనిపిస్తోంది. నిజానికి తనకు, సీనియర్ మోస్ట్ స్టార్ హీరో అయిన విజయ్ కు పోలిక లేదని, ఆయన్ను ఎప్పటికీ గౌరవిస్తానని యష్ పబ్లిక్ గ్గానే చెప్పాడు. పైగా రెండు సినిమాలు ఆడాలని […]