iDreamPost
android-app
ios-app

KGF Collections కెజిఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్లు

  • Published Apr 15, 2022 | 5:45 PM Updated Updated Apr 15, 2022 | 5:45 PM
  • Published Apr 15, 2022 | 5:45 PMUpdated Apr 15, 2022 | 5:45 PM
KGF Collections కెజిఎఫ్ 2 మొదటి రోజు కలెక్షన్లు

ఊహించిన దానికన్నా ఎక్కువగా కెజిఎఫ్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. బాలీవుడ్ సైతం నివ్వెరబోయేలా ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో ఆడటం చూసి తలలు పండిన ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కెజిఎఫ్ పార్ట్ 1 హిందీ వెర్షన్ ఫుల్ రన్ ఫిగర్స్ ఇప్పుడీ రెండో పార్ట్ కేవలం ఒకే రోజులో దాటేయడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. చాలా తక్కువ గ్యాప్ లో పుష్ప, ఆర్ఆర్ఆర్ ఇప్పుడీ కెజిఎఫ్ 2 అక్కడి మార్కెట్ మీద దండెత్తి వందల కోట్లను కొల్లగొట్టడం టాప్ స్టార్స్ కి నిద్రను దూరం చేయడం ఖాయం. అక్షయ్ కుమార్ బచ్చన్ పాండే ఇటీవలే డిజాస్టర్ కాగా గంగూబాయ్ కటియావాడి హిట్ అయ్యింది కానీ వీటి స్థాయిలో కాదు

యూనిట్ అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ లోనే ఇండియా వైడ్ 134 కోట్ల 50 లక్షల గ్రాస్ వచ్చిందట. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 164 కోట్ల దాకా ఉండొచ్చని ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పటిదాకా ఏ కన్నడ డబ్బింగ్ సినిమాకు సాధ్యం కానీ లెక్కలను కెజిఎఫ్ రెండు భాగాలు రాబట్టుకున్నాయి. శాండల్ వుడ్ పుట్టినప్పటి నుంచి రాజ్ కుమార్ నుంచి పునీత్ దాకా ఎన్ని బ్లాక్ బస్టర్లు వచ్చినా ఏవీ తెలుగులో ఈ స్థాయిలో ప్రభావం చూపించలేకపోయాయి. ఎప్పుడో రోబో తర్వాత ఆ రేంజ్ టికెట్ల జాతర ఒక్క కెజిఎఫ్ విషయంలోనే జరిగిందన్నది అతిశయోక్తి కాదు. ఏరియాల వారిగా తెలుగు వెర్షన్ లెక్కలు చూద్దాం

నైజామ్ – 9 కోట్ల 65 లక్షలు
సీడెడ్ – 2 కోట్ల 82 లక్షలు
ఉత్తరాంధ్ర – 1 కోటి 70 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 19 లక్షలు
వెస్ట్ గోదావరి – 84 లక్షలు
గుంటూరు – 1 కోటి 13 లక్షలు
కృష్ణా – 90 లక్షలు
నెల్లూరు – 81 లక్షలు

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ మొదటి రోజు షేర్ – 19 కోట్ల 4 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 78 కోట్లకు కెజిఎఫ్ 2 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఆ మొత్తం రావడం అసాధ్యమేమీ కాదు. ఇవాళ్టితో కలిపి మూడు రోజుల వీకెండ్ ఉంది కాబట్టి భారీ పెరుగుదల ఉంటుంది. కర్ణాటకలో 29 కోట్లు, తమిళనాడులో 8 కోట్లు, కేరళలో 7 కోట్లు, హిందీలో 63 కోట్లు, ఓవర్సీస్ లో 24 దాకా రాబట్టినట్టు ఒక అంచనా. ఎలా చూసుకున్నా ఇది రాఖీ భాయ్ అరాచకమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఇప్పుడు రాజమౌళి తర్వాత అంతటివాడుగా మూవీ లవర్స్ కీర్తిస్తున్నారు. దెబ్బకు ప్రభాస్ సలార్ మీద అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. అంతేమరి సునామి లాంటి హిట్ తర్వాత ఎఫెక్ట్ అలాగే ఉంటుంది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet