iDreamPost
android-app
ios-app

KGF Chapter 2 : రాఖీ భాయ్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే

  • Published Nov 25, 2021 | 7:09 AM Updated Updated Nov 25, 2021 | 7:09 AM
  • Published Nov 25, 2021 | 7:09 AMUpdated Nov 25, 2021 | 7:09 AM
KGF Chapter 2 : రాఖీ భాయ్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే

తన సినిమా లాల్ సింగ్ చద్దా విడుదల తేదీ ఏప్రిల్ 14తో నేరుగా క్లాష్ కి సిద్ధపడినందుకు కెజిఎఫ్ 2 టీమ్ కి సారీ చెప్పిన ఆమిర్ ఖాన్ వ్యవహారాన్ని కూల్ చేశాడు కానీ అసలు టెన్షన్ ఇప్పుడు నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ లో మొదలయ్యింది. కెజిఎఫ్ 2కి నార్త్ లోనూ ఎంత క్రేజ్ ఉన్నా అమీర్ తో తలపడటం అంత ఈజీ కాదు. పైగా ఓపెనింగ్ రోజు కలెక్షన్ల కోణంలో ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. హిందీ ఆడియన్స్ తమ ప్రాధాన్యత ముందు అమీర్ ఖాన్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు కెజిఎఫ్ 2 కు వసూళ్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. లేదంటే కోట్ల రూపాయల పెట్టుబడులు రిస్క్ లో పడతాయి.

అందుకే డిస్ట్రిబ్యూటర్ల నుంచి డేట్ ని మార్చమనే ఒత్తిడి మెల్లగా స్టార్ట్ అయ్యింది. ఆమిర్ కి ఎలాగూ చెప్పలేరు కాబట్టి యష్ బృందానికి రాయబారాలు పంపిస్తున్నట్టు తెలిసింది. నిర్మాతలు సైతం తలపడే తీరాలనే పంతంతో లేరు. మూడేళ్ళ క్రితం కెజిఎఫ్ 1 వచ్చినప్పుడు అదే రోజు షారుఖ్ ఖాన్ జీరో రిలీజయ్యింది. కానీ అది దారుణంగా డిజాస్టర్ కావడంతో కెజిఎఫ్ చాఫ్టర్ 1కి చాలా ప్లస్ అయ్యింది. కానీ ఇప్పుడలా జరుగుతుందని ఆశించలేం. లాల్ సింగ్ చద్దాలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ అన్నీ దగ్గరుండి చూసుకుని ప్రోడక్ట్ బెస్ట్ వచ్చేలా శ్రద్ధ తీసుకున్నారు. సో తక్కువ అంచనా వేయడానికి లేదు.

ఈ లెక్కన కెజిఎఫ్ 2 వాయిదా పడే ఛాన్స్ లేకపోలేదు. ఇది రాఖీ భాయ్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగించేదే. కాకపోతే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చూడాలి. పుష్ప, ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు మోస్తున్న కెజిఎఫ్ 2 మీద భారీగా బిజినెస్ జరిగింది. ఫస్ట్ పార్ట్ కి మించిన యాక్షన్ ఇందులో ఉంటుందని ప్రశాంత్ నీల్ ఇప్పటికే పలు మార్లు చెప్పి అంచనాలు పెంచేశాడు. ఇప్పుడవి కనక నిజమైతే మాత్రం వసూళ్ల జాతర ఖాయం. కాకపోతే కొత్త డేట్ ఫిక్స్ చేసుకునే పనైతే మాత్రం హిందీ, తెలుగు, తమిళంలలో ప్రధానంగా స్టార్ హీరోల సినిమాలు లేని టైంని పక్కాగా సెట్ చేసుకుంటే బెటర్

Also Read : Maanadu / The Loop : అక్కడ బొమ్మ పడింది – ఇక్కడ ఆగింది

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet