iDreamPost
android-app
ios-app

Beast & KGF Chapter 2 : కెజిఎఫ్ 2ని లెక్క చేయని బీస్ట్

  • Published Mar 22, 2022 | 11:50 AM Updated Updated Mar 22, 2022 | 11:50 AM
  • Published Mar 22, 2022 | 11:50 AMUpdated Mar 22, 2022 | 11:50 AM
Beast & KGF Chapter 2 : కెజిఎఫ్ 2ని లెక్క చేయని బీస్ట్

వచ్చే నెల ఏప్రిల్ 14న మోస్ట్ వెయిటెడ్ మూవీస్ అఫ్ ది ఇయర్ లో ఒకటైన కెజిఎఫ్ 2కి సోలో రిలీజ్ దక్కడం లేదు. విజయ్ బీస్ట్ ని ఒక రోజు ముందు 13న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్ణయించుకుని అధికారికంగా చెప్పేసింది. దాని తాలూకు కొత్త పోస్టర్ కూడా వదిలారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఫైనల్ వెర్షన్ లాక్ అయిపోయింది. తెలుగు డబ్బింగ్ హక్కుల డీల్ ఫైనల్ ఫినిష్ చేశారు. 10 కోట్లకు ఒప్పందం జరిగిందని, విజిల్ మాస్టర్ ఫలితాలను దృష్టిలో ఉంచుకుని విజయ్ కు టాలీవుడ్ లోనూ మార్కెట్ ఏర్పడిన నేపథ్యంలో మంచి మొత్తానికే ఇచ్చారట.

దీని వల్ల కెజిఎఫ్ 2కి చిక్కులు లేకపోలేదు. ఎందుకంటే విజయ్ సినిమా ఉందంటే తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు అధిక శాతం థియేటర్లలో దాన్ని వేసేందుకే మొగ్గు చూపుతారు. అప్పుడు రాఖీ భాయ్ కి ఆటోమేటిక్ గా స్క్రీన్లు తగ్గిపోయి ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. పైగా కేరళలోనూ ఇలాంటి సిచువేషనే ఏర్పడుతుంది.తెలుగులో కెజిఎఫ్ కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కానీ బీస్ట్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దీని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన డాక్టర్ ఇక్కడా గట్టి వసూళ్లు దక్కించుకుంది. అతని స్టైల్ కి మన ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. సో బీస్ట్ కి ఇదంతా ప్లస్సయ్యే వ్యవహారమే. అందుకే రేట్ వచ్చింది.

సో ఇదిప్పుడు యష్ VS విజయ్ బాక్సాఫీస్ వార్ గా మారనుంది. బీస్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్. అనిరుద్ రవిచందర్ పాటలు ఆల్రెడీ యూత్ కి ఎక్కేస్తున్నాయి. ఈ విషయంలో పోలిస్తే కెజిఎఫ్ 2 వెనుకబడి ఉంది. కనీసం టీజర్ రిలీజ్ చేయలేదు. ఏదో మొక్కుబడిగా అన్నట్టు పోస్టర్లు మాత్రం వదులుతున్నారు. నిన్న విడుదల చేసిన తూఫాన్ లిరికల్ సాంగ్ కూడా మరీ గొప్పగా చెప్పుకునేలా అనిపించలేదు. ఆర్ఆర్ఆర్ వచ్చిన ఇరవై రోజులకు ఈ రెండు సినిమాలు రాబోతున్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారనుంది. బీస్ట్ ఒక షాపింగ్ మాల్ లో జరిగే హోస్టేజ్ డ్రామాగా రూపొందించారని సోషల్ మీడియాలో తిరుగుతున్న ఇన్ సైడ్ టాక్.

Also Read : Benefit Show Prices : ఒక్క టికెట్ కేవలం 5 వేలే

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet