iDreamPost
android-app
ios-app

తప్పుకున్న జెర్సీ – KGF ఎఫెక్ట్

  • Published Apr 11, 2022 | 10:36 AM Updated Updated Apr 11, 2022 | 10:36 AM
తప్పుకున్న జెర్సీ – KGF ఎఫెక్ట్

Shahid Kapoor’s ‘Jersey’ gets postponedనిన్నటి దాకా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న హిందీ జెర్సీ ఫైనల్ గా వెనుకడుగు వేసింది. దీనికి ప్రధాన కారణం కెజిఎఫ్ 2 ప్రభంజనమే. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జెర్సీ చాలా వెనుకబడి ఉండటంతో పాటు వాయిదా వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి అధికంగా రావడంతో ఇంకో మార్గం లేకపోయింది. దానికి తోడు తమిళనాడు, కేరళలో విజయ్ బీస్ట్ ప్రభావం గట్టిగా కొడుతోంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో దెబ్బ తినాల్సి వస్తుందనే వాస్తవాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నారు. హై ఎమోషన్స్ మీద నడిచే బరువైన డ్రామాలు అలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ ముందు నిలవడం కష్టం. అందుకే రాత్రి పొద్దుపోయాక ఏప్రిల్ 14న రావడం లేదనే నిర్ణయం ప్రకటించారు.

దానికి బదులు జెర్సీ ఏప్రిల్ 22న థియేటర్లలో అడుగు పెడుతుంది. అప్పటికి కెజిఎఫ్ 2 జోరు తగ్గుతుందని చెప్పలేం. టాక్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం మళ్ళీ జెర్సీకి ఇబ్బందులు తప్పవు. కానీ అంతకు మించి ఆప్షన్ లేదు కాబట్టి తాడో పేడో తేల్చుకోవాల్సిందే. ఇక్కడ నాని హిందీ వెర్షన్ ని డీల్ చేసిన గౌతమ్ తిన్ననూరే దీనికీ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్, దిల్ రాజు, నాగ వంశీ ఇందులో నిర్మాణ భాగస్వాములు. షాహిద్ కపూర్ హీరోగా చేసిన ఈ సినిమాలో సత్యరాజ్ పాత్రను పంకజ్ కపూర్ పోషించారు. దాదాపు తెలుగునే సీన్ టు సీన్ రీమేక్ చేశారు కానీ అదనంగా జోడించిన పావు గంటలో ఏముందో చూడాలి

ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ సెన్సేషన్ బాక్సాఫీస్ చూడలేదు. అందుకే ఈ బుధ గురువారాలు రాబోతున్న సినిమాల మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వందల కోట్ల మార్కెట్ తో ముడిపడిన గ్రాండియర్స్ కావడంతో థియేటర్లు మళ్ళీ కళకళలాడతాయనే నమ్మకం కనిపిస్తోంది. ముంబై ఢిల్లీ తదితర ప్రధాన నగరాల్లో జెర్సీ బుకింగ్స్ రెండు రోజుల క్రితమే మొదలుపెట్టారు కానీ ఆక్యుపెన్సీ శాతం 25 కూడా దాటాకపోవడం ఆందోళన కలిగించే విషయం. నార్త్ ఆడియన్స్ కూడా కెజిఎఫ్ 2 కోసమే ఎగబడుతున్నప్పుడు ఈ స్పోర్ట్స్ మూవీని ఎవరు పట్టించుకుంటారు. పుష్పకు ఎదురెళ్ళిన 83 అనుభవం అంత ఈజీగా మర్చిపోయేదా