iDreamPost
android-app
ios-app

Prabhas Salaar teaser ప్రభాస్ అభిమానులకు స‌ర్ ప్రైజ్

  • Published Apr 07, 2022 | 5:22 PM Updated Updated Dec 23, 2023 | 11:28 AM
Prabhas Salaar teaser ప్రభాస్ అభిమానులకు స‌ర్ ప్రైజ్

Salaar Teaser to be Out on April 14 ఇటీవలే విడుదలైన రాధేశ్యామ్ డిజాస్టర్ దెబ్బకు నీరసపడిపోయిన డార్లింగ్ అభిమానుల కోసం సలార్ టీజర్ రెడీ అవుతోందట. 14న రిలీజవుతున్న కెజిఎఫ్ 2 తో పాటు దీన్ని ప్రదర్శించబోతున్నట్టు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. ఎంత సేపు ఉంటుందనేది తెలియదు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోయే రేంజ్ లో ఎలివేషన్లు పెట్టినట్టు తెలిసింది. కెజిఎఫ్ 2 మీద తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన నేపథ్యంలో ఏదైనా నష్టం వస్తే సలార్ తో సర్దుతారనే వార్తలు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సలార్ టీజర్ ని ఇలా ప్లాన్ చేయడం వెనుక ఏదైనా మతలబు ఉందేమో.

రాధే శ్యామ్ ఫ్లాప్ అవ్వడం పక్కనపెడితే ప్రభాస్ ఇమేజ్ కి అది పెద్ద చేటు చేసింది. కంటెంట్ వీక్ గా ఉండటం, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్లాప్ గా ముద్ర వేయించుకోవడం, అన్నిటిని మించి హీరో లుక్స్ మీద చాలా విమర్శలు రావడం ఇటీవలి కాలంలో ఎవరికీ జరగలేదు. ఎంత ప్యాన్ ఇండియా స్టార్ అయినంత మాత్రాన అన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా వెళ్లకూడదని రాధే శ్యామ్ హెచ్చరిక చేసింది. పైగా బాహుబలితో నేషనల్ లెవెల్ ఇమేజ్ ఇచ్చిన రాజమౌళినే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా చరణ్, తారక్ లను నార్త్ ఆడియన్స్ కు చేరువ చేశాడు. వాళ్ళకు ఇంకో పెద్ద ప్యాన్ ఇండియా హిట్టు పడితే చాలు ప్రభాస్ తో పాటు అక్కడి మార్కెట్ ని ఎంజాయ్ చేస్తారు.

ఈ పరిణామాల దృష్ట్యా ప్రభాస్ సబ్జెక్టు సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండబోతున్నాడు. ప్రస్తుతం మోకాలికి ఏదో చిన్న ఆపరేషన్ జరగడం వల్ల నెల రోజులు రెస్ట్ లో ఉంటాడని సన్నిహితుల మాట. ఈ నెల 10న లాంఛనంగా మారుతీ దర్శకత్వం సినిమా మొదలుపెట్టి రెగ్యులర్ షూటింగ్స్ అన్నీ జూన్ నుంచి తిరిగి రీ స్టార్ట్ చేయొచ్చనే మాట వినిపిస్తోంది. సలార్, ఆది పురుష్ రెండిట్లో ఒకటి ఈ ఏడాదే విడుదలవుతుందనే అంచనా ఉంది కానీ అది సాధ్యం కాకపోవచ్చు. అన్నట్టు కెజిఎఫ్ 2లో ప్రభాస్ చిన్న క్యామియో చేశాడని ఒక లీక్ బయటికి వచ్చింది. అదే నిజమైతే అంతకన్నా గూస్ బంప్స్ మూమెంట్ ఫ్యాన్స్ కి ఇంకేముంటుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu