iDreamPost
android-app
ios-app

KGF 2కెజిఎఫ్ 2 బిజినెస్ డీటెయిల్స్

  • Published Apr 12, 2022 | 11:51 AM Updated Updated Apr 12, 2022 | 11:51 AM
KGF 2కెజిఎఫ్ 2 బిజినెస్ డీటెయిల్స్

ఇంకో రెండు రోజుల్లో రాఖీ భాయ్ గా రాబోతున్నాడు యష్. బ్లాక్ బస్టర్ కెజిఎఫ్ కు సీక్వెల్ గా రాబోతున్న ఈ చాప్టర్ 2 కోసం యూనిట్ విస్తృతంగా ప్రమోషన్లు చేస్తోంది. మరీ ఆర్ఆర్ఆర్ రేంజ్ కాదు కానీ ఉన్నంతలో హీరో దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే చక్కర్లు కొడుతున్నారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో యష్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ మీడియా అడిగిన ప్రశ్నలకు మన బాషలోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నించడం ఆకట్టుకుంది. కర్ణాటక కంటే ఎక్కువగా ఏపి తెలంగాణలో కెజిఎఫ్ 2కు క్రేజ్ కనిపిస్తోంది. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల వర్షం ఖాయమని చెప్పొచ్చు

ఇక బిజినెస్ విషయానికి వస్తే ఏ కన్నడ సినిమా డబ్బింగ్ కు ఇప్పటిదాకా జరగని రేంజ్ లో డిస్ట్రిబ్యూటర్లు దీనికోసం పెట్టుబడులు పెట్టారు. సుమారు 80 కోట్ల షేర్ ని టార్గెట్ చేసుకుని దిగుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఏపిలో కొన్ని చోట్ల బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ కాగా హైక్ కోసం ప్రయత్నిస్తున్న తెలంగాణ పంపిణీదారుల వల్ల అక్కడ ఆన్ లైన్ టికెట్ల అమ్మకం ఆలస్యం అవుతోంది. అనుమతులు వస్తాయనే ధీమాతో ఇంకా బుక్ మై షో, పేటిఎంలో సేల్స్ మొదలుపెట్టలేదు. విజయ్ బీస్ట్ పోటీగా ఉన్నప్పటికీ దాని ఎఫెక్ట్ కెజిఎఫ్ 2 మీద అంతగా లేదు. పైగా బీస్ట్ సంగతి రేపే తేలిపోతుంది. ఇక ఏరియాల వారీగా చూస్తే

నైజామ్ – 25 కోట్లు
సీడెడ్ – 14 కోట్లు
ఉత్తరాంధ్ర – 10 కోట్లు
ఈస్ట్ గోదావరి – 7 కోట్లు
వెస్ట్ గోదావరి – 6 కోట్లు
గుంటూరు – 7 కోట్లు
కృష్ణ – 6 కోట్లు
నెల్లూరు – 3 కోట్లు

ఏపి తెలంగాణ మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ – 78 కోట్లు

రజనీకాంత్ సినిమాలు మినహాయిస్తే గతంలో ఏ డబ్బింగ్ మూవీకీ ఈ స్థాయిలో జరగలేదు. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగినప్పటికీ మూవీకి యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా అవసరం. ఆర్ఆర్ఆర్ చాలా మటుకు నెమ్మదించింది. కెజిఎఫ్ 2, బీస్ట్ లు బాగుంటే ఇక ఫైనల్ రన్ వైపు అడుగులు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇవి యావరేజ్ అనిపించుకుంటే అప్పుడు తిరిగి ఆర్ఆర్ఆర్ కే బెనిఫిట్ అవుతుంది. శాండల్ వుడ్ స్టాండర్డ్ ని అమాంతం పెంచిన కెజిఎఫ్ 2 ఫలితం గురించి ఒక్క కన్నడ పరిశ్రమే కాదు నార్త్ లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముంబై లాంటి నగరాల్లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్సే దానికి కారణం