iDreamPost
android-app
ios-app

KGF 2 : రాఖీ భాయ్ కోసం రిపేర్లు చేస్తున్నారు

  • Published Feb 18, 2022 | 7:15 AM Updated Updated Feb 18, 2022 | 7:15 AM
  • Published Feb 18, 2022 | 7:15 AMUpdated Feb 18, 2022 | 7:15 AM
KGF 2 : రాఖీ భాయ్ కోసం రిపేర్లు చేస్తున్నారు

ఈ ఏడాది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీస్ లిస్టులో ఉన్న కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా రేస్ నుంచి తప్పుకోవడంతో యష్ కు ఈ మార్పు చాలా పెద్ద ప్లస్ కాబోతోంది. విజయ్ బీస్ట్ అదే డేట్ కి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కాబట్టి అప్పుడే ఒక నిర్ధారణకు రాలేం. కెజిఎఫ్ 2 లాగే ఇది కూడా అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమా కావడంతో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మూడేళ్ళ క్రితం సైలెంట్ గా వచ్చి నేషన్ వైడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ 1 సీక్వెల్ గా రెండో భాగం మీద మాములు అంచనాలు లేవు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పుడో కొత్త ట్విస్టు వినిపిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫైనల్ కట్ చూశాక రాఖీ భాయ్ ఇంట్రో సాంగ్ అంత సంతృప్తికరంగా అనిపించలేదట. అందుకే ఈ పాటని మళ్ళీ రీ షూట్ చేసే దిశగా ప్లానింగ్ చేస్తున్నట్టు వినికిడి. ఈ కారణంగానే షూటింగ్ ఎప్పుడో పూర్తయినా గెడ్డం తీసేయొద్దని యష్ కు ముందే చెప్పి పెట్టిన ప్రశాంత్ నీల్ దాన్ని కరెక్ట్ టైంలో ఉపయోగించుకోబోతున్నాడు. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో వాటిని క్రాస్ చేసే టార్గెట్ ప్లస్ ఒత్తిడి కెజిఎఫ్ 2 మీద ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఏ విషయంలోనూ రాజీ పడే సమస్యే లేదని ప్రశాంత్ భావిస్తున్నారు.

ఎప్పుడు తీస్తారు లాంటి డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కానీ న్యూస్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటి భాగంతో పోల్చుకుంటే కెజిఎఫ్ 2 బడ్జెట్ పరంగా క్యాస్టింగ్ పరంగా చాలా పెద్ద స్కేల్ కు చేరుకుంది. ఫస్ట్ పార్ట్ లో లేని ప్రకాష్ రాజ్, రావు రమేష్ లతో పాటు బాలీవుడ్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ సంజయ్ దత్, రవీనాటాండన్ లు తోడవ్వడంతో రేంజ్ బాగా పెరిగిపోయింది. అంచనాలు ఏ మాత్రం మ్యాచ్ అయినా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మాములుగా ఉండదు. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాకే దీనికి సంబందించిన ప్రమోషన్లను ఉధృతంగా చేసేలా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ పక్కా ప్లానింగ్ తో ఉంది

Also Read : Actress Kalyani : డైరెక్టర్ గా మారనున్న కబడ్డీ కథానాయిక

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet