చాలా ఏళ్ళ పాటు ఫిలిం మేకర్స్ ఒక కేస్ స్టడీగా చదవాల్సిన సినిమా కాంతార. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, కేవలం ఒక ప్రాంతానికే పరిమితమైన సంస్కృతిని తీసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ గల్లీ దాకా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా తీయడం హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి ప్రతిభకు నిదర్శనం. కేవలం పదహారు కోట్లతో హోంబాలే ఫిలింస్ నిర్మించిన ఈ విలేజ్ వండర్ ఫైనల్ రన్ అయ్యేలోపు నాలుగు వందల కోట్లకు పైగా […]
ఒకప్పుడు టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల ఆధిపత్యం తీవ్రంగా ఉండేది . శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల పుణ్యమాని రజనీకాంత్, సూర్య, విక్రమ్ టైపు హీరోలకు ఇక్కడ పెద్ద మార్కెట్ ఏర్పడింది. క్రమంగా వరసగ ఫ్లాపులు రావడంతో ఒకప్పటిలా ఇప్పుడు పరిస్థితి లేదు 2022లో వీటి ప్రోగ్రెస్ ఎలా ఉందో ముందు చూద్దాం. ‘కెజిఎఫ్ 2’ ఊహించినట్టే అంచనాలకు మించేసి తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేసింది. మొదటి భాగానికి మించి అనేలా అంచనాలన్నీ దాటేసి సూపర్ […]
ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాల రేటింగ్స్ రివ్యూలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి టాప్ ఇండియన్ సినిమాల లిస్టు విడుదల చేసింది. మొదటి స్థానం ఎలాంటి అనుమానం లేకుండా ఆర్ఆర్ఆర్ కే దక్కింది. ఏదో ఒక విభాగంలో ఆస్కార్ వస్తుందన్న గట్టి నమ్మకం వ్యక్తమవుతున్న టైంలో ఇవన్నీ శుభసూచనలుగానే చెప్పుకోవాలి. రెండో ప్లేస్ ది కాశ్మీర్ ఫైల్స్ సంపాదించుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నఈ ఒక్క మూవీనే బాలీవుడ్ […]
తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ గడప దాకా తీసుకెళ్తున్న ఘనత సొంతం చేసుకున్న రాజమౌళి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమి లేదు. బడ్జెట్ వందల కోట్లు పెట్టినా అంతకంతా దానికి రెట్టింపు రాబట్టడంలో ఆయన ఆలోచన, ప్లానింగ్, అమలు చేసే విధానం అన్నీ వేరే లెవెల్ లో ఉంటాయి. అన్నిటిని మించి స్టార్ హీరోలను హ్యాండిల్ చేసే తీరు హీరోయిజంని ఎలివేట్ చేసే విధానం ఇప్పటిదాకా ఓటమి లేకుండా చేసింది. ఇటీవలే ఓ వెబ్ మ్యాగజైన్ నిర్వహించిన […]
ఇది నిజంగా నమ్మశక్యం కానీ నిజం. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దానికి ఎన్నో కారణాలున్నాయి. మాస్ హీరోయిజం, ఎప్పుడూ చూడని కోలార్ బంగారు గనుల నేపథ్యం, కోట్లాది రూపాయల బడ్జెట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రాఖీ భాయ్ తరహా పాత్రలు గతంలోనూ వచ్చినప్పటికీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే తరహాలో ఆడియన్స్ ఫీలవ్వడంతో అంత గొప్ప విజయం సొంతం చేసుకుంది. చాలా పరిమితంగా ఉండే శాండల్ వుడ్ మార్కెట్ ని […]
డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఎంతగా మొత్తుకుంటున్నా నిర్మాతలు మీటింగులు పెట్టుకుని మరీ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఓటిటి స్ట్రీమింగ్ కు సంబంధించి మాత్రం థియేటర్ గ్యాప్ ని పెంచలేకపోతున్నారు. ఆ మధ్య ఎనిమిది వారాల కనీస నిడివి ఉండాలని చెప్పిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆచరణలో దాన్ని కఠినంగా అమలు చేయలేకపోతోంది. నెల తిరక్కుండానే కార్తీ రీసెంట్ సూపర్ హిట్ సర్దార్ ఈ నెల 18న ఆహాలో వచ్చేస్తోంది. మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అందుకున్న సక్సెస్ ఫుల్ మూవీ […]
ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చోటు దక్కించుకున్న కాంతార ఒరిజినల్ వెర్షన్ రిలీజై యాభై రోజులకు దగ్గరగా ఉండగా తెలుగు వెర్షన్ సరిగ్గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. కేవలం 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి ఇప్పటిదాకా 26 కోట్ల 71 లక్షల షేర్ రాబట్టిన ఈ శాండల్ వుడ్ వండర్ ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తునే ఉంది. ప్రధాన కేంద్రాల్లో ఇప్పటికీ హౌస్ ఫుల్ […]
అగ్ర నిర్మాణ సంస్థలే పెద్ద బడ్జెట్ లను భారంగా భావిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న క్రమంలో కంటెంట్ ను నమ్ముకుంటే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో హోంబాలే ఫిలిమ్స్ చూపిస్తోంది. చాలా పరిమితంగా ఉండే కన్నడ మార్కెట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతున్న ఘనత దీనికే దక్కుతుంది. ఒకే ఏడాదిలో రెండు బ్లాక్ బస్టర్స్ తో ఏకంగా పదిహేను వందల కోట్ల మార్కుని సాధించడం తలలు పండిన బాలీవుడ్ బ్యానర్ల వల్లే కాలేదు. యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న యష్ […]
మాములుగా ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి మీద లాభాలు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఎంతలేదన్నా ఆరు నెలలతో మొదలుకుని సంవత్సరాల దాక ఫలానా టైం ఫ్రేమ్ అని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఒక్క సినీ పరిశ్రమలో మాత్రమే అనూహ్యమైన రాబడిని అందుకోవచ్చు. ఇది పూరి అన్నట్టు గ్యాంబ్లింగ్. సరిగ్గా గురి కుదిరిందా కోట్లు వర్షంలా కురుస్తాయి. లేదూ అదృష్టం బెడిసి కొట్టి బ్యాడ్ లక్ పలకరించిందా వందల కోట్లు కర్పూరంలా కరిగిపోతాయి. ఇప్పుడిదంతా చెప్పడానికి కారణం […]
స్టార్లు లేకుండా ఒక కన్నడ డబ్బింగ్ సినిమా ఈ స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందని దాని దర్శక హీరో రిషబ్ శెట్టి కూడా ఊహించలేదు. అందుకే అంత అనుభవమున్న అల్లు అరవింద్ తెలుగు హక్కుల డీల్ విషయంలో పర్సెంటేజ్ మాట్లాడుకున్నారు తప్ప అవుట్ రైట్ గా కొనే సాహసం చేయలేదు. లేదంటే ఇప్పుడీ కాంతార గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కు బంగారు బాతులా మారిపోయి గత ఏడాదిలో వచ్చిన డిజాస్టర్ల తాలూకు నష్టాలకు భర్తీ చేసేది. త్రివిక్రమ్ శ్రీనివాస్ […]