కాంతార.. గతేడాది ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ సినిమా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కన్నడలో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం భాషలలో సైతం విడుదలై.. వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేజీఎఫ్, సలార్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే.. రిలీజ్ అయ్యాక పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ లో కనెక్ట్ అయ్యింది. దీంతో ఏకంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ వైపు వరల్డ్ మొత్తం తిరిగి చూసేలా చేసింది కాంతార.
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాకు ప్రీక్వెల్ రాబోతుంది. కాంతార భారీ విజయం సాధించడంతో.. కాంతార 2 ఉంటుందని రిషబ్ శెట్టి, హోంబలే ఫిలిమ్స్ వారు అధికారికంగా ప్రకటించారు. సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన కాంతార.. అటు కంటెంట్ పరంగా.. ఇటు మ్యూజిక్ పరంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అసలు కన్నడలో రూపొందిన మూవీ.. తెలుగులో డబ్ అయి.. రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో క్రేజ్ ఎలా ఉందో.. అలాగే వరల్డ్ వైడ్ రూ.400 కోట్లకు పైగా వసూల్ చేయడం మామూలు విషయం కాదు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కాంతార 2కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్నాయి. కాంతార మూవీకి సీక్వెల్ గా కాకుండా ప్రీక్వెల్ గా ‘కాంతార 2’ ప్లాన్ చేశారు. ఈ ఏడాది దీపావళి తర్వాత షూటింగ్ మొదలుపెట్టి.. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. తాజాగా కాంతార 2 బడ్జెట్ కి సంబంధించి కొన్ని కథనాలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. కాంతార రూ. 16 కోట్లతో నిర్మించగా.. ఈసారి పార్ట్ 2 కోసం ఏకంగా 8 రెట్లు బడ్జెట్ పెంచేశారట. అంటే.. సుమారు రూ. 125 కోట్లు అని కొందరు సినీ విశ్లేషకులు ట్వీట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు. కానీ.. బడ్జెట్ చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఒకవేళ నిజమే అయితే ఎందుకని అంత పెంచారో తెలియాల్సి ఉంది. చూడాలి మరి దీనిపై మేకర్స్ ఏమైనా రియాక్ట్ అవుతారేమో! కాంతార 2 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Budget – ₹1⃣2⃣5⃣ cr
Shoot – Nov 2023
Release – 2024 2nd half||#RishabShetty | #Kantara|| pic.twitter.com/fEFSkSRSgy
— Manobala Vijayabalan (@ManobalaV) August 22, 2023