P Venkatesh
బాలరాముని ప్రాణ ప్రతిష్ట వేళ ఇప్పటికే సినీ రంగానికి చెందిన సౌత్ అండ్ నార్త్ స్టార్స్ అయోధ్యకు చేరుకున్నారు. వారిలో కాంతారా హీరో రిషబ్ శెట్టి కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్నారు.
బాలరాముని ప్రాణ ప్రతిష్ట వేళ ఇప్పటికే సినీ రంగానికి చెందిన సౌత్ అండ్ నార్త్ స్టార్స్ అయోధ్యకు చేరుకున్నారు. వారిలో కాంతారా హీరో రిషబ్ శెట్టి కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్నారు.
P Venkatesh
శతాబ్ధాలుగా ఎన్నో తరాల వారు కలలుగన్న అయోధ్య రామ్ మందిర్ నేడు మన కళ్ల ముందట నిలిచింది. నేటి తరం వారికి రానున్న తరాల వారికి ఇదొక గొప్ప అదృష్టమనే చెప్పాలి. రామ్ మందిర్ ఆలయం నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకార్యక్రమాలతో ఈ మహత్తర క్రతువు ప్రారంభమైంది. అయోధ్యలో కొలువుదీరనున్న కోదండ రాముని దర్శన భాగ్యం అందరికీ దక్కనుంది. ఇక ఈ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీరామ ఆలయ ట్రస్టు వారు దేశంలోని ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు. ఈ నేపథ్యంలో నేడు పలు రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు చేరుకున్నారు. వారిలో కాంతారా హీరో రిషబ్ శెట్టి కుటుంబ సమేతంగా అయోధ్యకు చేరుకున్నారు.
బాలరాముని ప్రాణ ప్రతిష్ట వేళ ఇప్పటికే సినీ రంగానికి చెందిన సౌత్ అండ్ నార్త్ స్టార్స్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యలో సినీ తారల సందడి నెలకొంది. ఈ క్రమంలో కాంతారా నటుడు రిషబ్ శెట్టి అయోధ్యకు చేరుకున్నారు. తన భార్య ప్రగతి శెట్టితో కలిసి అయోధ్యను సందర్శించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్టకంటే ముందు హనుమంతుడిని దర్శించుకున్నారు హీరో రిషబ్ శెట్టి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. అయోధ్యకు మొదటి సారి వచ్చానని చాలా సంతోషంగా ఉందని తెలిపారు. చిన్నప్పటి నుంచే రామ భక్తి కలిగి ఉండే వాడినని తెలిపారు.
మేము చిన్నప్పటి నుంచి శ్రీరాముని ప్రవచనాలు, ఆయన ఆదర్శమైన జీవిత కథలను వింటూ పెరిగాం. ఇప్పుడు ఆ శ్రీరాముడే అయోధ్యకు రమ్మని మమ్మల్ని పిలిచాడు. ఇది నా పూర్వ జన్మ సుకృతం. ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నా జన్మధన్మమైందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక రిషబ్ శెట్టి పోస్టు చేసిన ఆ పోస్టు పట్ల నెటిజన్స్ జై శ్రీరామ్ నినాదాాలతో హోరెత్తిస్తున్నారు. కాగా కాంతారా సినిమా విజయంతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. నటుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కాంతారా: చాప్టర్ 1 సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి రిషబ్ శెట్టి అయోధ్యను సందర్శించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.