iDreamPost
android-app
ios-app

తెలుగులోకి ‘కాంతార’ హీరోయిన్.. ఇక్కడ లక్ ఎలా ఉందో మరి!

  • Author ajaykrishna Updated - 12:34 PM, Thu - 31 August 23
  • Author ajaykrishna Updated - 12:34 PM, Thu - 31 August 23
తెలుగులోకి ‘కాంతార’ హీరోయిన్.. ఇక్కడ లక్ ఎలా ఉందో మరి!

సినీ ఇండస్ట్రీలో నిలబడాలంటే హీరోయిన్స్ కి అందం, అభినయం మాత్రమే సరిపోవు. ఆవగింజ అంత అదృష్టం కూడా కలిసి రావాలని ఎన్నాళ్ళుగానో చెబుతూ వస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ విషయంలో అదృష్టం అనేది నిజంగానే కలిసి వస్తుందేమో అనిపిస్తుంది.. మరికొన్నిసార్లు అందం, అభినయం ఉంటే సరిపోతాయేమో అనిపిస్తుంటుంది. అయితే.. వీటిలో అదృష్టం సంగతి పక్కన పెడితే.. అందం, అభినయం ఈ రెండే ఎప్పుడూ కౌంట్ లోకి వచ్చేది. మరి అదృష్టం సంగతేంటి? అనంటే.. అదికూడా హీరోయిన్స్ చేతిలోనే ఉందంటున్నారు. ఎందుకంటే.. హీరోయిన్స్ కథల ఎంపిక ఎంత బాగుంటే.. కెరీర్ కూడా అలాగే సాగుతుందని చెబుతున్నారు.

రీసెంట్ గా కన్నడలో కాంతారతో బ్లాక్ బస్టర్ హిట్ తో డెబ్యూ చేసిన బ్యూటీ సప్తమి గౌడ. తెలుగులో అడుగు పెట్టేందుకు రెడీ అవుతోందని తెలుస్తుంది. ఫస్ట్ మూవీనే సూపర్ సక్సెస్ అయ్యేసరికి ఈ భామ తెలుగులో ఎప్పుడు డెబ్యూ చేస్తుందా అని అందరు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే.. కాంతారలో గ్రామీణ యువతిగా, కానిస్టేబుల్ పాత్రలో ముద్దుగా కనిపించిన సప్తమి.. కాస్త గ్లామర్ టచ్ కూడా చూపించింది. దీంతో తెలుగులో ఏ హీరోతో రాబోతుందో అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. తాజాగా సప్తమి టాలీవుడ్ డెబ్యూకి సమయం ఆసన్నమైనట్లు టాక్ నడుస్తోంది. ఓ క్రేజీ మూవీతో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతుందట.

ఆ వివరాల్లోకి వెళ్తే.. సప్తమి గౌడ తెలుగులో హీరో నితిన్ సరసన నటించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో నితిన్ హీరోగా ‘తమ్ముడు’ అనే మూవీ లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా సప్తమి గౌడను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఈ విషయమై మేకర్స్ నుండి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ.. సోషల్ మీడియా సప్తమి టాలీవుడ్ ఎంట్రీ తమ్ముడుతోనే అని కథనాలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ నిజమే అయితే.. రష్మిక మాదిరి ఈ కన్నడ బ్యూటీని కూడా ఆదరించడానికి ప్రేక్షకులు, యూత్ రెడీగానే ఉన్నారు. మరి తెలుగులో సప్తమి అదృష్టం ఎలా ఉందో చూడాలి. ఈ బ్యూటీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş