ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన తెలుగు విద్యార్థి అక్కడ సముద్రంలో గల్లంతై మృతి చెందాడు. కర్నూల్ లోని బాలాజీనగర్ బాలాజీ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న చిలుమూరు శ్రీనివాసరావు, శారద దంపతుల పెద్దకొడుకు దిలీప్ (24) ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువేందుకు 2019లో ఇటలీ వెళ్లాడు. గతేడాది ఏప్రిల్ లో కర్నూల్ కు వచ్చిన దిలీప్.. తిరిగి సెప్టెంబర్లో ఇటలీకి వెళ్లాడు. అక్కడ తను చదువుతున్న కోర్సు పూర్తవ్వగా.. ఉద్యోగం తెచ్చుకున్నాక ఇంటికి వస్తానని ఇటీవలే […]
ఒక్కరోజులో 9,887 పాజిటివ్ కేసులు-294 మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకి 8వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 కేసులు నిర్దారణ కాగా, 294మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,36,657కు కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 6,642 కు చేరిందని కేంద్ర […]
కరోనా వైరస్ తాకిడి ఇప్పుడు మొత్తం వ్యవస్థనే తల్లకిందులు చేసింది. చాలామంది అంచనాలు, ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. అదే సమయంలో అన్ని చోట్లా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. ఎందుకు తగ్గడం లేదనేది ఎవరికీ అంతుబట్టని వ్యవహారంగా మారింది. తొలుత విదేశీ యాత్రికులు, ఆ తర్వాత మర్కజ్ నుంచి వచ్చిన వారు కారణాలుగా స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు అలాంటి క్లారిటీ కూడా […]
వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కరోనా మహమ్మారి ఏమాత్రం అదుపులోకి రాకుండా రోగులు పిట్టల్లా రాలిపోవడం ఇప్పటి తరానికి కొత్తగా ఉన్నా, మానవాళి చరిత్రలో ఇలాంటి మహమ్మారులు ఎన్నో ఉన్నాయి. ప్లేగ్, మశూచి, ఫ్లూ, పోలియో ఇలా అనేక రకాల జబ్బులు లక్షల సంఖ్యలో ప్రాణాలు తీసిన ఘటనలు చరిత్రలో ఉన్నాయి. టీకాలు, మందులూ ఏమీ లేని ఆ రోజుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ ప్రధాన ఆయుధాలుగా ఆ రోజుల్లో ప్రజలు ఈ మహమ్మారులతో […]
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచ దేశాలు చాలా రోజులుగా లాక్ డౌన్లోనే ఉండిపోయాయి. గడచిన రెండు జనరేషన్లలో బయటపడని నగ్నసత్యాలు ఈ లాక్ డౌన్లో బయటపడ్డాయి. బయటపడ్డ నిజాలు జాతీయ, అంతర్జాతీయంగా వర్గీకరిస్తే చాలా మంచి విషయాలే మన ముందు ఆవిష్కృతమవుతాయి. ముందుగా జాతీయ స్ధాయినే తీసుకుంటే ప్రపంచంలోని చాలా దేశాలను వణికించేస్తున్న వైరస్ తీవ్రత భారతదేశంపై పెద్దగా లేదనే చెప్పాలి. తీవ్రత ఎందుకు లేదంటే విదేశీయులతో పోల్చినపుడు భారతీయుల్లో చాలామందికి రోగ నిరోధక శక్తి […]
అవును నిజంగా ప్రపంచానికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రపంచం మొత్తాన్ని వణికించేసిన కరోనా వైరస్ దాదాపు నెల రోజుల తర్వాత ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో నెమ్మదించిందనే అనుకోవాలి. మార్చి 20వ తేదీ తర్వాత రోజువారి లెక్కలతో పోల్చుకుంటే పై దేశాల్లో బాధితులు, మృతుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వాలు నివేదికలను విడుదల చేశాయి. ఏప్రిల్ 13వ తేదీన ప్రభుత్వాలు విడుదల చేసిన నివేదికల ప్రకారం స్పెయిన్ లో సోమవారం 2665 కేసులు మాత్రమే నమోదవ్వగా […]
ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ దెబ్బకు సుమారు లక్షమందికి పైగా బలైపోయారు. మొదట్లో వైరస్ ను తేలిగ్గా తీసుకున్న చాలా దేశాల్లోనే బాధితులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొత్తం బాధితుల సంఖ్య 17 లక్షల దిశగా వేగంగా వెళుతోంది. అలాగే మృతుల సంఖ్య కూడా 1,01,482కి చేరుకోవటం గమనార్హం. మామూలుగా ప్రకృతి వైపరీత్యాలకు కూడా లక్షమంది మరణించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవనే అనుకోవాలి. బాధితుల్లో ఎక్కువగా అంటే అమెరికాలో 5 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా […]
ఇటలీలో విద్యను అభ్యసించడానికి వెళ్లి ఇటలీని కరోనా వైరస్ కుదిపేస్తున్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో చిక్కుకుపోయారు. గత 26 రోజులుగా ఢిల్లీలోని ఐటీబీపీ క్వార్టర్స్ లో క్వారెంటయిన్ పేరిట కాలం వెళ్లదీస్తున్న వారి గోడును పట్టించుకునేవారు లేక అక్కడే మగ్గుతున్నారు.. ఉన్నత విద్య కోసం ఇటలీ వెళ్లిన 214 మంది భారత విద్యార్థులు ప్రత్యేక విమానంలో స్వదేశానికి తిరిగి వచ్చారు.. 14 రోజులు క్వారెంటయిన్ లో గడిపిన తర్వాత పంజాబ్,హర్యానా, మధ్యప్రదేశ్ […]
కరోనా(కోవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే పలు దేశాలు కరోనా కారణంగా వణుకుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా, స్పెయిన్,బ్రిటన్, ఇటలీల పరిస్థితి రోజు రోజుకు దిగజరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 10,98,848కి చేరగా మరణాల సంఖ్య 58,871కు చేరుకొంది. శుక్రవారం స్పెయిన్లో 900 మందికిపైగా కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. బ్రిటన్లో ఒక్కరోజులోనే 569 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన 4వేల పడకల ఫీల్డ్ ఆసుపత్రిని ప్రారంభించింది. […]
చైనా, ఇటలీతో పోలిస్తే మనకు కరోనా ముప్పు ఎలా ఉంటుంది.. ఓ విశ్లేషణ 1. కరోనావైరస్ భారతదేశంలో లక్షలాది మందికి సోకుతుందా? చైనా మరియు ఇటలీలోని వుహాన్లో, పదివేల మంది ప్రభావితమయ్యారు మరియు వేలాది మంది మరణించారు. ఈ రెండు కేంద్రాలలో ఈ వ్యాధి భయంకరమైన రేటుతో వ్యాపించగా, ఇతర దేశాలు మరియు ముఖ్యంగా భారతదేశం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి లేదు. మార్చి 3 వరకు, భారతదేశంలో ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులు 3 మాత్రమే ఉన్నాయి […]