iDreamPost
android-app
ios-app

వీడియో: యోట్‌ నుంచి సముద్రంలోకి దూకిన భారత క్రికెటర్‌ ధావన్‌! ఎందుకంటే..?

  • Published Jul 27, 2024 | 4:22 PMUpdated Jul 27, 2024 | 4:22 PM

Shikhar Dhawan, Italy: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సముద్రంలోకి దూకేశాడు. అలా ఎందుకు చేశాడు.. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Shikhar Dhawan, Italy: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌, ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ సముద్రంలోకి దూకేశాడు. అలా ఎందుకు చేశాడు.. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jul 27, 2024 | 4:22 PMUpdated Jul 27, 2024 | 4:22 PM
వీడియో: యోట్‌ నుంచి సముద్రంలోకి దూకిన భారత క్రికెటర్‌ ధావన్‌! ఎందుకంటే..?

టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ సముద్రంలోకి దూకేశాడు. అయ్యే.. ధావన్‌కు అంత కష్టం ఏమొచ్చింది? ఎందుకు సముద్రంలోకి దూకేశాడు? అంటూ కంగారు పడకండి. పూర్తి విషయం తెలుసుకుందాం.. చాలా కాలం క్రితమే టీమిండియాలో చోటు కోల్పోయిన టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌.. ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. రోహిత్‌ శర్మకు జోడీగా బరిలోకి దిగుతూ.. ఓపెనర్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన ధావన్‌.. బ్యాడ్‌ ఫామ్‌తో జట్టులో స్థానంలో పోగొట్టుకున్నాడు. దాంతో పాటు వివాహబంధంలో గొడవలతో ఇబ్బంది పడ్డా కూడా.. ధావన్‌ సోషల్‌ మీడియాలో హ్యాపీగా ఉన్నట్లే కనిపించేవాడు.

సినిమా పాటలకు డ్యాన్సులు, డైలాగులు చెప్తూ.. ఫన్నీ వీడియోస్‌ పోస్ట్‌ చేస్తుంటాడు. టీమిండియాలో ఉన్న సమయంలో కూడా తోటి క్రికెటర్లతో రీల్స్‌ చేసేవాడు. ప్రస్తుతం ఇటలీలో వెకేషన్‌లో ఉన్న ధావన్‌.. సముద్రంలో దూకాడు. తన యోట్‌ నుంచి సముద్రంలోకి డైవ్‌ చేసి.. సరదాగా ఈ కొట్టాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు ధావన్‌. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ‘వే మార్జానియా’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. వే మార్జానియా పాటకు స్టెపులేస్తూనే సముద్రంలోకి దూకేశాడు ధావన్‌.

ఇక ఐపీఎల్‌ 2024 తర్వాత ధావన్‌ పూర్తిగా వెకేషన్‌లోనే ఉన్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ధావన్‌.. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 30.40 యావరేజ్‌తో 152 పరుగులు చేశాడు. ఐదు మ్యాచ్‌ల తర్వాత భుజం గాయంతో ధావన్‌ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. పంజాబ్‌ కింగ్స్‌ 14 మ్యాచ్‌ల్లో కేవలం 5 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఇక ధావన్‌ ఇంటర్నేషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. దాదాపు ముగిసిపోయినట్లే భావించాలి. ఎందుకంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ధావన్‌ తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. మరి ధావన్‌ సముద్రంలోకి డైవ్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి