iDreamPost
android-app
ios-app

గాల్లోనే విమానానికి రంధ్రం.. భయపడిన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

  • Author singhj Published - 05:59 PM, Wed - 26 July 23
  • Author singhj Published - 05:59 PM, Wed - 26 July 23
గాల్లోనే విమానానికి రంధ్రం.. భయపడిన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ఇంట్లో నుంచి కాలు బయటకు పెడుతున్నామంటే ఎవ్వరైనా సరే తిరిగి సురక్షితంగా రావాలనే అనుకుంటారు. అయితే ప్రయాణాల్లో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రమాదం ఎప్పుడు ఎటు వైపు నుంచి వస్తుందో చెప్పలేం. వాహనాలు నడిపేటప్పుడు అన్ని రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే ప్రమాద ముప్పును కొంత నివారించగలం. రోడ్డు, రైలు జర్నీలతో పోల్చుకుంటే ఈ విషయంలో విమాన ప్రయాణం బెటర్ అని విశ్లేషకులు అంటున్నారు. రోడ్డు ప్రయాణాల్లో యాక్సిడెంట్స్​కు ఆస్కారం ఎక్కువ. అదే రైళ్ల విషయానికొస్తే ఈ ముప్పు కొంచెం తక్కువే.

రైలు ప్రయాణాలతో పోలిస్తే విమానాలకు ప్రమాద ముప్పు మరింత తక్కువని విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్లైట్ జర్నీ వేగవంతమే కాదు సేఫ్ అని అంటున్నారు. అయితే విమానాలు కూడా ఒక్కోసారి ప్రమాదానికి గురైన ఘటనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయి విమానాలు ప్రమాదానికి గురైన ఘటనల గురించి వార్తల్లో వినే ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇటలీలోని మిలాన్ నగరం నుంచి యూఎస్​లోని న్యూయార్క్ ఎయిర్​పోర్ట్​కు బయల్దేరిన ఒక విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రోమ్​లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Flight has hole meanwhile in air

న్యూయార్క్ పోస్ట్ రిపోర్ట్‌ ప్రకారం.. డెల్టా ఎయిర్​లైన్స్​కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్యాసింజర్లతో మిలాన్ నుంచి బయల్దేరింది. అయితే ఫ్లైట్​ గాల్లోకి ఎగిరిన టైమ్​లో అనుకూలంగానే ఉన్న వాతావరణం ఆ తర్వాత ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. ఆ విమానం గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల్లోపే వడగళ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడం మొదలైంది. వడగళ్లు కాస్తా విమానం ముక్కు, రెక్కలపై పడ్డాయి. దీంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. విమానం ముక్కుకైతే ఏకంగా పెద్దపాటి రంధ్రం పడింది. దీంతో ఫ్లైట్​లోని ప్రయాణికులు భయపడ్డారు. అయితే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రోమ్​కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందులోని ప్యాసింజర్లు ఊపిరి పీల్చుకున్నారు.