iDreamPost
android-app
ios-app

గర్ల్​ఫ్రెండ్​కు ఏకంగా రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన మాజీ ప్రధాని!

  • Author singhj Published - 05:41 PM, Mon - 10 July 23
  • Author singhj Published - 05:41 PM, Mon - 10 July 23
గర్ల్​ఫ్రెండ్​కు ఏకంగా రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన మాజీ ప్రధాని!

ఒక దేశానికి మాజీ ప్రధాని ఆయన. లుకేమియా వ్యాధితో బాధపడుతూ గత నెలలో కన్నుమూశారు. అయితే ఆయన వీలునామాలోని ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్​గా మారింది. భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు కాకుండా కేవలం తన గర్ల్​ఫ్రెండ్ పేరుపై ఆయన వందల కోట్ల రూపాయలను రాసిచ్చేశారు. దీంతో ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అయ్యారు. అవును, ఇది నిజమే. ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రేయసికి ఏకంగా రూ.906 కోట్ల ఆస్తిని రాసిచ్చేశారు. బెర్లుస్కోని గత నెలలో పరమపదించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్​కు గురై ఆయన ప్రాణాలు విడిచారు.

గత కొన్ని సంవత్సరాలుగా మార్తా ఫాసినా అనే 33 ఏళ్ల మహిళతో బెర్లుస్కోని ప్రేమాయణం కొనసాగించారు. ఇద్దరి నడుమ 53 ఏళ్ల వయోభేదం ఉంది. అయినా వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. తన మనసు దోచిన ప్రేయసి ఫాసినాకు రూ.906 కోట్ల ఆస్తిని బెర్లుస్కోని రాశారని.. ఈ మేరకు ఆయన తన వీలునామాలో పేర్కొన్నారని ది గార్డియన్ పత్రిక ఒక కథనంలో తెలిపింది. ఇటలీ దేశంలోని ధనవంతుల్లోకెల్లా బెర్లుస్కోని ఒకరు. ఆయన మొత్తం సంపద విలువ రూ.4.6 లక్షల కోట్లు అని సమాచారం. అన్ని లక్షల కోట్ల ఆస్తులు కలిగిన బెర్లుస్కోనీకి రూ.906 కోట్లు పెద్ద విషయం కానప్పటికీ.. ఆయనతో డేటింగ్ చేసిన ఫాసినాకు మాత్రం ఇది పెద్ద సర్​ప్రైజ్ అని చెప్పాలి.

బెర్లుస్కోనీతో డేటింగ్ చేసిన మార్తా ఫాసినా కూడా పొలిటికల్ లీడర్ కావడం విశేషం. ఇటలీ పార్లమెంట్ దిగువ సభ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్​లో ఫాసినా 2018 నుంచి మెంబర్​గా కొనసాగుతున్నారు. ఆమెతో బెర్లుస్కోనికి 2020 మార్చి నుంచి రిలేషన్​ నడుస్తోంది. వీళ్లిద్దరూ లీగల్​గా పెళ్లి చేసుకోలేదు. అయితే మరణశయ్య మీద ఉన్నప్పుడు ఫాసినాను తన భార్యగానే చెప్పుకున్నారు బెర్లుస్కోని. ఆయన నెలకొల్పిన ఫోర్జా ఇటాలియా పార్టీలో మార్తా ఫాసినా ఒక సభ్యురాలు కావడం గమనార్హం. ఇక, బెర్లుస్కోని స్థాపించిన వ్యాపార సామ్రాజ్యం ఫిన్​ఇన్వెస్ట్​ను ఆయన పెద్ద కుమార్తె మెరీనా, కొడుకు పియర్ సిల్వియోలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో వీరికి 53 శాతం వాటా ఉందని తెలుస్తోంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap