iDreamPost
android-app
ios-app

వరుణ్ తేజ్-లవణ్యల పెళ్లి ఖర్చు ఎన్నికోట్లో తెలుసా?

  • Author Soma Sekhar Published - 10:52 AM, Fri - 3 November 23

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఖర్చుకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వరుణ్ తేజ్ పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఖర్చుకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వరుణ్ తేజ్ పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 10:52 AM, Fri - 3 November 23
వరుణ్ తేజ్-లవణ్యల పెళ్లి ఖర్చు ఎన్నికోట్లో తెలుసా?

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి తాజాగా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి నవంబర్ 1న ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటుగా.. రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరైయ్యారు. వరుణ్-లవణ్యల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. వీరి పెళ్లి ఖర్చుకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వరుణ్ తేజ్ పెళ్లి ఖర్చు ఎన్ని కోట్లో ఇప్పుడు తెలుసుకుందాం.

‘మిస్టర్’ సినిమా షూటింగ్ టైమ్ లో వరుణ్-లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీరిద్దరు ప్రేమపక్షుల్లా.. కెమెరా కంటికి చిక్కకుండా విహరించారు. కాగా.. మిస్టర్ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జరిగింది. అందుకే తమ పెళ్లి అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ జంట. అందులో భాగంగానే ఇటలీలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ భారీగానే ఖర్చుపెట్టినట్లు వార్తలు వైరల్ గా మారాయి. కాక్ టైల్, హల్దీ, మోహందీ, పెళ్లి.. ఇలా ప్రతీ వేడుకను కళ్లు జిగేల్ మనేలా సెలబ్రేట్ చేసింది మెగా కుటుంబం.

కాగా.. వచ్చిన అతిథులందరికి ఈ పెళ్లి గుర్తుండిపోయేలా చేయాలని ముందే నిర్ణయించుకున్నారట మెగా ఫ్యామిలీ. అందుకే ఖర్చులో ఎక్కడా రాజీపడినట్లు కనిపించట్లేదు. కాగా.. సోషల్ మీడియాలో వినిపిస్తున్న లెక్కల ప్రకారం.. వరుణ్-లావణ్యల పెళ్లికి దాదాపు రూ. 15-17 కోట్ల మేర ఖర్చుచేశారట. అయితే పెళ్లికే ఇంత మెుత్తంలో ఖర్చుపెడితే.. ఇక రిసెప్షన్ కు ఇంకెంత ఖర్చుపెడతారో అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాగా.. హైదరాబాద్ లో నవంబర్ 5న వరుణ్-లావణ్యల రిసెప్షన్ జరగనుంది. మరి ఈ వేడుకు ఏ రేంజ్ లో జరగనుందో వేచిచూడాలి అంటున్నారు నెటిజన్లు.