iDreamPost
android-app
ios-app

వీడియో: రౌడీల మాదిరి పార్లమెంట్ లో ఎంపీల ఫైటింగ్!

ఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా మారి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం  లాంటి చట్టసభల్లో కొట్టుకుంటూ దేశ పరువును బజారుకు ఈడుస్తున్నారు. అలానే తాజాగా పార్లమెంట్ లో కొందరు ఎంపీలు రౌడీల మాదిరిగా ప్రవర్తించారు.

ఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా మారి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం  లాంటి చట్టసభల్లో కొట్టుకుంటూ దేశ పరువును బజారుకు ఈడుస్తున్నారు. అలానే తాజాగా పార్లమెంట్ లో కొందరు ఎంపీలు రౌడీల మాదిరిగా ప్రవర్తించారు.

వీడియో: రౌడీల మాదిరి పార్లమెంట్ లో ఎంపీల ఫైటింగ్!

ప్రజాప్రతినిధుల అంటే.. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ..వారికి ఆదర్శంగా నిలవాలి. అలా ఎంతో మంది నాయకులు ప్రజల చేత ఎన్నోబడి.. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు సంపాదిస్తారు. అయితే ఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధులు వీధి రౌడీల కంటే దారుణంగా మారి ప్రవర్తిస్తున్నారు. దేవాలయం  లాంటి చట్టసభల్లో కొట్టుకుంటూ దేశ పరువును బజారుకు ఈడుస్తున్నారు. తాజాగా గ్యాంగ్ వార్ మాదిరిగా పార్లమెంట్ లో కొందరు ఎంపీలు ఫైటింగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఎక్కడ, ఎందుకు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ స్టోరీ ఇటలీ పార్లమెంట్ లో చోటుచేసుకుంది. గురువారం ఈ దేశ పార్లమెంట్స్ బాక్సింగ్ గేమ్ రింగ్ గా మారింది. ఓ బిల్లు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఓ ఎంపీ వచ్చి ఆ దేశ జెండాతో నిరసన తెలిపే ప్రయత్నం  చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల గౌరవాన్ని మర్చి  ప్రవర్తించారు.  గ్యాంగ్ వార్ కి తీసిపోని విధంగా ఇటలీ ఎంపీలు పార్లమెంట్ లోర ఫైటింగ్ చేసుకున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార పార్టీ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టింది.

అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాన్ని ఖండించారు. ఈ క్రమంలో ఓ ఎంపీ పార్లమెంటులో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించే ప్రయత్నించారు. ఇదే సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాట జరిగింది. ఈ బిల్లు కారణంగా ఇటలీలో పేదరికంలో మగ్గుతున్న ఆదేశంలోని  దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు. త్వరలో ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరగనుంది.  ఈ నేపథ్యంలోనే  వివిధ దేశాలకు చెందిన నేతలు ఇలా విచక్షణ, చట్టసభల గౌరవాన్ని మరిచి పరస్పరం దాడులకు దిగడంపై చర్చినీయాంశమైంది. భారత ప్రధాని మోదీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటారు.  మొత్తంగా ప్రస్తుతం ఎంపీల ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.