ఇండియాలో జీవితాల్ని మార్చేసే క్రీడల్లో ప్రధానమైనది క్రికెట్. ఎవరూ ఆపలేని ప్రతిభ ఉంటే చాలు, క్రికెట్ లో రాణించి కాసులు సంపాదించొచ్చు. ఇలాంటి అవకాశమే నేటి యవ ఆటగాళ్ళకు అందిస్తోంది ఐపీఎల్. మ్యాచ్ ను మలుపు తిప్పే టాలెంట్ ఉన్నవాళ్ళకు ఐపీఎల్ రెడ్ కార్పెట్ వేస్తోంది. అయితే ఈ ఏడాది ఈ ముగ్గురు ఆటగాళ్ళ వైనం మాత్రం ఒకింత భిన్నం. వేలంలో కోట్లు పోసి కొన్నా, ఆ క్రీడాకారులు బెంచ్ కు పరిమితం అవ్వడమే ఇప్పుడు అసలు టాపిక్. […]
IPL 2022లో ఎవ్వరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ IPL లో ఇంగ్లాండ్ కి చెందిన జోస్ బట్లర్ అత్యధిక రన్స్ సాధించి 17 మ్యాచ్‌ల్లో 863 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచి సరికొత్త రికార్డు సాధించాడు. దీంతో అత్యధిక పరుగులు సాధించిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ని కైవసం చేసుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌కు బట్లర్ బ్యాటింగే ప్రధాన బలం. తన బ్యాటింగ్ తో ఎన్నో సార్లు రాజస్థాన్ […]
IPL లో ఆక్షన్ ద్వారా కాకుండా మ్యాచ్ లలో తమ ఆటతో కూడా సంపాదించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ IPL-2022లో ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా ఆడి ఇంకా ఎక్కువే సంపాదించాడు. ఉమ్రాన్ మాలిక్ ని యాక్షన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 కోట్లకు దక్కించుకుంది. #ఈ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ప్రతి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు మాలిక్ దే. దీంతో 14 […]
IPL 2022 సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సీజన్లో ఎవరికీ అంచనాలు లేని కొత్త టీమ్స్ టేబుల్ టాప్ లోకి వెళ్లగా, టాప్ లో ఉంటాయి అనుకున్న టీమ్స్ అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఊహించని బ్యాటర్స్ దుమ్ము దులిపేసారు. ఎవరూ ఊహించని విధంగా రకరకాల ట్విస్టులతో ఈ సీజన్ సాగింది. ఇక మొదటిసారి వచ్చిన టీం గుజరాత్ టైటాన్స్ అనూహ్యంగా ఫైనల్ కి వెళ్ళింది. ఎప్పుడో మొదటి సీజన్లో కప్పు కొట్టిన రాజస్థాన్ మళ్ళీ ఇన్నాళ్ళకి ఫైనల్ […]
IPL2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. తుది సమరానికి సిద్ధమయ్యారు. ఎన్నో ట్విస్టులతో, మరెన్నో ఊహించని పరిణామాలతో ఈ IPL సాగింది. ఈ సీజన్‌తోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ మొదటిసారి ఫైనల్ కి చేరింది. ఇక ఎప్పుడో IPL మొదటి సీజన్ లో కప్పు కొట్టిన రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ ఇన్నేళ్లకు ఫైనల్ కి చేరుకుంది. ఈ రెండు జట్లు ఇవాళ(మే 29) ఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్ జట్ల […]
IPL 2022 సీజన్ చివరి దశకి చేరుకుంది. మే 27న రాజస్తాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య క్వాలిఫైయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 29న గుజరాత్ టైటాన్స్‌తో జరుగనున్న టైటిల్ పోరుకు వెళ్తుంది. దీంతో ఇప్పుడు అందరి కళ్ళు RCB జట్టు పైనే ఉన్నాయి. అనూహ్యంగా ప్లేఆఫ్స్ కి అర్హత సాధించింది RCB. ఎలిమినేటర్ మ్యాచ్ లో టీం సమిష్టి కృషితో గెలిచి మరింత ముందుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా […]
నరేంద్ర మోడీ స్టేడియంలో IPL2022 క్వాలిఫయర్–2లో బెంగళూరు – రాజస్తాన్ జట్లు తలపడనున్నాయి. టైటిల్ ఫైట్ లో గుజరాత్‌ను బలంగా ఢీకొట్టాలని అటు ఆర్‌సీబీ, ఇటు రాయల్స్ పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో రాజస్థాన్ మెరుగ్గా కనిపిస్తున్నా, ఆర్సీబీ కూడా బలంగా ఉంది. బెంగళూరులో స్టార్ బ్యాటర్ల ఫామ్ సరిగ్గా లేదు. దీంతో ఆ జట్టు భయపడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.. స్థిరంగా ఆడటంలో విఫలమవుతుండడం తెలిసిందే. లక్నోతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ వీరు […]
పంజాబ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ తన తండ్రి చేతిలో దెబ్బలు తిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. IPL2022లో పంజాబ్ టీమ్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతో తన తండ్రి తనని కొట్టారని ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు ధావన్. ఆ వీడియోలో శిఖర్ తండ్రి శిఖర్ ధావన్ ని చెంప మీద కొట్టి, కింద పడేసి కాలితో తంతున్నారు. ఆయనని ఆపడానికి కొంతమంది ప్రయత్నించినా అతను కొడుతూనే ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ […]
బుధవారం రాత్రి IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అవ్వగానే RCB అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా యువ క్రికెటర్ రజత్ పాటిదార్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకొని మొత్తంగా 54 బంతుల్లో 112 […]
IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో మంచి ఫామ్ లో ఉండటంతో RCB పై ఎక్కువ అంచనాలు లేవు. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అయిపోవడంతో ఈ సారి కూడా RCB వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రజిత్ పాటిదార్ గ్రౌండ్ లో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్స్, […]