iDreamPost
android-app
ios-app

IPL 2022 : నేను బ్యాటింగ్ వదిలేసి దినేష్ కార్తీక్ కి ఇద్దామనుకున్నా..

  • Published May 09, 2022 | 4:58 PM Updated Updated May 09, 2022 | 4:58 PM
IPL 2022 : నేను బ్యాటింగ్ వదిలేసి దినేష్ కార్తీక్ కి ఇద్దామనుకున్నా..

IPL 2022లో ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుకి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగుళూరు 20 ఓవర్లకు గాను 192 పరుగులు చేసింది. కోహ్లీ గోల్డన్‌ డకౌట్‌ అయినా డుప్లెసిస్‌ 73 పరుగులు, రజత్‌ పటిదార్‌ 48 పరుగులు, మాక్స్‌వెల్‌ 33 పరుగులు సాధించారు. చివర్లో బ్యాటింగ్ కి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ 8 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు.

ఇక తర్వాత బ్యాటింగ్ కి దిగిన హైదరాబాద్ 19.2 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయి 125 పరుగులు మాత్రమే చేశారు. దీంతో బెంగుళూరు భారీ విజయం సాధించింది. దినేష్ కార్తిక్ మంచి ఫామ్ లో ఉండటంతో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం బెంగుళూరు కెప్టెన్ డుప్లిసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

డుప్లిసిస్ మాట్లాడుతూ.. డీకే ఇలాగే సిక్సులు కొడుతూ బ్యాటింగ్‌ చేస్తుంటే ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకున్నాను. నిజం చెప్పాలంటే నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా అలసిపోయాను. ఆ సమయంలో నేను రిటైర్‌ ఔట్‌గా వెళ్ళిపోయి కార్తిక్ ని క్రీజులోకి పంపించాలి అనుకున్నాను. అతడు ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడాడు అని తెలిపాడు.