iDreamPost
iDreamPost
IPL2022లో ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. లక్నో మంచి ఫామ్ లో ఉండటంతో RCB పై ఎక్కువ అంచనాలు లేవు. మొదట బ్యాటింగ్ చేసిన RCBలో కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లిసిస్ ఇలా అందరూ త్వరగానే అవుట్ అయిపోవడంతో ఈ సారి కూడా RCB వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రజిత్ పాటిదార్ గ్రౌండ్ లో విధ్వంసం సృష్టించాడు. వరుస సిక్స్, ఫోర్స్ లతో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పాటిదార్ కి దినేష్ కార్తీక్ తోడవ్వగా ఇద్దరూ కలిసి లక్నోని కోలుకోలేని దెబ్బ కొట్టారు. మొత్తం 20 ఓవర్లకు గాను RCB 207 పరుగులు చేసి భారీ టార్గెట్ ని లక్నోకి ఇచ్చింది.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన లక్నోలో KL రాహుల్, దీపక్ హుడా తప్ప ఎవరూ అంతగా రాణించలేకపోయారు. దీంతో 20 ఓవర్లకు లక్నో 193 పరుగులు చేసి మ్యాచ్ ఓడిపోయి IPL2022 నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో బెంగళూరు భారీ విజయం సాధించి ముందుకెళ్లింది. ప్రతి సీజన్ లోను RCB ఇక్కడిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఈ సారి మాత్రం మెరుగైన ఆటతో కప్పు కొట్టాలని దృడంగా ఫిక్స్ అయింది. RCBకి అభిమానులు కూడా ఎక్కువే. ప్రతిసారి RCB కప్పు గెలుస్తుందనే నమ్మకంతోనే ఉంటున్నారు. కానీ చివర్లో ఆశలు అడియాసలు అవుతున్నాయి.
ఈ మ్యాచ్ గెలవడంతో RCB కప్పుకి రెండు అడుగుల దూరంలో ఉండిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో గెలిస్తే డైరెక్ట్ ఫైనల్ కి వెళ్లి గుజరాత్ తో తలపడనుంది. రాజస్థాన్ మ్యాచ్ లో కూడా ఇలాగే ఆడితే ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మొదటి నుంచి సూపర్ ఫామ్ లో ఉన్న గుజరాత్ తో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కప్పు చేతికొస్తుంది RCBకి. మరి నిన్నటి మ్యాచ్ లో దుమ్ము దులిపేసిన RCB ఇంకో రెండు స్టెప్స్ వేసి కప్పుని అందుకొని ఎంతో మంది అభిమానుల ఆశని నెరవేరుస్తుందా చూడాలి.