iDreamPost
android-app
ios-app

IPL 2022: RR vs RCB కల నెరవేర్చుకునేది ఎవరు..?

  • Published May 27, 2022 | 8:45 AM Updated Updated May 27, 2022 | 11:11 AM
IPL 2022: RR vs RCB కల నెరవేర్చుకునేది ఎవరు..?

నరేంద్ర మోడీ స్టేడియంలో IPL2022 క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లో బెంగళూరు – రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్లు తలపడనున్నాయి. టైటిల్ ఫైట్ లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలంగా ఢీకొట్టాలని అటు ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ, ఇటు రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పక్కా ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో రాజస్థాన్ మెరుగ్గా కనిపిస్తున్నా, ఆర్సీబీ కూడా బలంగా ఉంది. బెంగళూరులో స్టార్ బ్యాటర్ల ఫామ్ సరిగ్గా లేదు. దీంతో ఆ జట్టు భయపడుతోంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డుప్లెసిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. స్థిరంగా ఆడటంలో విఫలమవుతుండడం తెలిసిందే.

లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ వీరు ఆశించినంతగా రాణించలేదు. క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–2లోనూ ఇదే తీరు కొనసాగిస్తారా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రజత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటిదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రావడం ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశం. పటిదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై అందరి దృష్టి నెలకొంది. దినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరోసారి చెలరేగితే రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కష్టాలు తప్పవని వెల్లడిస్తున్నారు విశ్లేషకులు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. హసరంగ, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హర్షల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మంచి ఫామ్ కనబరుస్తున్నారు.

రాయల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో.. బట్లర్ పైనే చాలా మంది ఆధారపడుతున్నారు. కెప్టెన్ శాంసన్ బ్యాట్ ఝులిపిస్తున్నా.. భారీ స్కోరు సాధించలేకపోతున్నాడు. పరాగ్, హెట్ మయర్ రాణించడం లేదు. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్.. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో రాణిస్తున్నాడు. బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రసీధ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కృష్ణలు బౌలింగ్ లో చక్కటి తీరు కనబరుస్తున్నారు. ఒబేద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెకే మాత్రం బౌలింగ్ లో విఫలమౌతున్నాడు. మరి ఈ రెండు జట్లలో ఫైనల్ కి ఎవరు వెళ్తారో చూడాలి.

జట్ల అంచనా :
బెంగళూరు: డుప్లెసిస్ (కెప్టెన్), కోహ్లీ, పటిదార్, మ్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వెల్, లోమ్రోర్, కార్తీక్, షాబాజ్ అహ్మద్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్, సిరాజ్

రాజస్తాన్: జైస్వాల్, బట్లర్, శాంసన్ (కెప్టెన్), పడిక్కల్, రవి అశ్విన్, హెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మయర్, రియాన్ పరాగ్, బౌల్ట్, ప్రసిధ్, చహల్, ఒబెద్ మెకే – కుల్దీప్ సేన్.