Swetha
తమ సినిమాను ఒక్క పార్ట్ లో చెప్పడం కష్టమని.. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు దర్శకులు. వాటిలో మొదటిది సూపర్ డూపర్ హిట్ అయితే.. రెండోది ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. అక్కడక్కడా కొన్ని ప్లాప్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ చాలా వరకు పాన్ ఇండియా సినిమాలన్నీ ఇలా రెండు భాగాలుగానే తీస్తున్నారు మేకర్స్.
తమ సినిమాను ఒక్క పార్ట్ లో చెప్పడం కష్టమని.. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు దర్శకులు. వాటిలో మొదటిది సూపర్ డూపర్ హిట్ అయితే.. రెండోది ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. అక్కడక్కడా కొన్ని ప్లాప్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ చాలా వరకు పాన్ ఇండియా సినిమాలన్నీ ఇలా రెండు భాగాలుగానే తీస్తున్నారు మేకర్స్.
Swetha
తమ సినిమాను ఒక్క పార్ట్ లో చెప్పడం కష్టమని.. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు దర్శకులు. వాటిలో మొదటిది సూపర్ డూపర్ హిట్ అయితే.. రెండోది ఆటోమాటిక్ గా హిట్ అవుతుంది. అక్కడక్కడా కొన్ని ప్లాప్స్ కూడా వస్తూనే ఉన్నాయి. కానీ చాలా వరకు పాన్ ఇండియా సినిమాలన్నీ ఇలా రెండు భాగాలుగానే తీస్తున్నారు మేకర్స్. ఇలా సిక్వెల్స్ కు ఆద్యం పోసిన దర్శకుడు ఎవరంటే అది దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడే అదే రాజమౌళి మరోసారి ఇంకో కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతున్నాడేమో అనే సందేహాలు కొందరిలో మొదలవుతున్నాయి.
బాహుబలి రెండు భాగాలను కలిపి.. బాహుబలి ది ఎపిక్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు.. రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది.. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ ని ఇతర దర్శకులు ఫాలో అవుతారా అంటే.. చెప్పలేము గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఫాలో అయ్యేలానే ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు , తమిళంలో చాలానే సిక్వెల్ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్:కథానాయకుడు .. మహానాయకుడు కలిపి ఒకటే మూవీగా వచ్చినా ఆశ్చర్యం లేదు. అలాగే తమిళంలో వచ్చిన పోనియన్ సెల్వన్ రెండు భాగాలుగా రిలీజ్ చేసారు. అయితే మొదటి భాగానికి వచ్చినంత రెస్పాన్స్.. రెండు భాగానికి రాలేదు.
ఇప్పుడు రెండు భాగాలను కలిపి ఒకటిగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తీసిన కెజిఎఫ్ చాప్టర్ 1 , చాప్టర్ 2… ఇందులో కూడా ఎక్స్ట్రా సీన్స్ ను కట్ చేసి కెజిఎఫ్ గా చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా పుష్ప రాజ్ ఎలాంటి హంగామా చేసాడో తెలియనిది కాదు. పుష్ప 2 అయితే విపరీతమైన సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండింటిలోనూ పార్లల్ రన్నింగ్ సీన్స్ ను కట్ చేసి ఒకటిగా చెప్పొచ్చు. కానీ లెక్కల మాస్టారు సుకుమార్ మూడో భాగం కూడా ఉంటుందనే హింట్ ఇచ్చారు. సో మరి దీని సంగతైతే చెప్పలేము. ఒకవేళ బాహుబలి ఎపిక్ కనుక హిట్ అయితే.. మిగిలిన పాన్ ఇండియా సిక్వెల్స్ కూడా ఎడిటింగ్ వెర్షన్ కు రావొచ్చు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.